Telugu Current Affairs Highlights 06 May 2018

Telugu Current Affairs Highlights 06 May 2018

Telugu Current Affairs Highlights 06 May 2018





> అంగారకుడిపైకి మానవులను పంపేందుకు సన్నాహకంగా కీలక వివరాలను సేకరించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కీలక వ్యోమనౌకను ప్రయోగించింది. అరుణగ్రహ నేల లోతుల్లో చోటుచేసుకునే ప్రకంపనలను ఆలకించడానికి తొలిసారిగా ‘ఇన్‌సైట్‌’ అనే ల్యాండర్‌ను నింగిలోకి పంపింది
> నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC)కు జాతీయ పురస్కారం లభించింది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్య యోజన(DBUGKY) కింద నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 3వ స్థానంలో నిలిచింది.
> అమెరికాలో 2017లో 50 కోట్లకు పైగా ఫోన్‌ కాల్‌ రికార్డు వివరాలను ఆ దేశ నిఘా సంస్థ(NSA) సేకరించింది.
ఒడిశాలోని బరగఢ్‌ జిల్లాలో అంగనదిపై సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి నిరసనగా ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులు కారుణ్య మరణాలకు అనుమతి కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 2018 మే 5న ఉత్తరాలు రాశారు.
>  జాతీయ జల అభివృద్ధి సంస్థ(NWDA) డైరెక్టర్‌ జనరల్‌గా ఎం.కె.శ్రీనివాస్‌ నియమితులయ్యారు.
> నిజామాబాద్‌ ఎంపీ కవిత 2018 మే 5న హైదరాబాద్‌లో తెలంగాణ తొలి దళిత కవి ‘మాదిగ మహాయోగి దున్న ఇద్దాసు’ తత్వగ్రంథావిష్కరణ చేశారు. తెలంగాణ వికాస సమితి (తెవిస) ఆధ్వర్యంలో ఈ గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇద్దాసు మునిమనుమడు దున్న విశ్వనాథం ఈ గ్రంథ సంపాదకుడు.
> ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది టీవీ పురస్కారాలను ప్రకటించింది.
>  పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌. షారుఖ్‌ జె కథావాలా 2018 మే 4 ఉదయం నుంచి మే 5 తెల్లవారుజాము 3.30 గంటల దాకా కేసు విచారణను కొనసాగించారు
> తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కూచిభొట్లపై జాతి విద్వేషంతో కాల్పులు జరిపి హతమార్చిన అమెరికన్‌ ఆడమ్‌ ప్యూరింటన్‌కు జీవిత ఖైదు పడింది