Telugu Current Affairs Highlights 07 April 2018

Telugu Current Affairs Highlights 07 April 2018

Telugu Current Affairs Highlights 07 April 2018

>రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫామ్‌లు, రైళ్లలో ఇండియన్‌ రైల్వేస్‌ లేదా IRCTC విక్రయించే భోజనాలు, పానీయాలపై 5 శాతం GST
>అంబేద్కర్ జయంతి సందర్భంగా “గ్రామ స్వరాజ్ అభియాన్”  2018 ఏప్రిల్ 14 వ తేదీ నుంచి మే 5 వ తేదీ వరకు జరగనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు
>అంతర్జాతీయ ఆర్థిక సంక్షిప్త సేవల సహకార సంస్థ SWIFT తన మెరుగుపరచిన సేవలను భారత్‌లో తొలిసారిగా ICICI బ్యాంక్‌కు అందజేస్తున్నట్లు తెలిపింది
> ఐక్యరాజ్యసమితి 2018 ప్రపంచ ఆర్థిక పరిస్థితి నివేదికలో భారత దేశ ఆర్థిక వృద్ధి  2018-20 నాటికి 7.2 శాతం వృద్ధిరేటును 2019-20 నాటికి 7.4 శాతానికి పెరగవచ్చని భావిస్తున్నారు.
>ఆటిజం ట్రైనింగ్ కోసం మూడురోజుల నేషనల్ వర్క్ షాప్ న్యూ ఢిల్లీ లో ప్రారంభం అయ్యింది
>దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకి అవినీతి కేసులో 24 ఏళ్ల జైలుశిక్ష పడింది. లంచం, అధికార దుర్వినియోగం వంటి పలు కేసుల విచారణలో పార్క్‌ దోషిగా తేలారు
>హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పంచాణన్‌ మొహంతి రెండు కొత్త భాషలను వెలుగులోకి తీసుకొచ్చారు. వీటిని వాల్మీకి, మల్హార్‌గా గుర్తించారు.
>వాతావరణ పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా భారత్‌ మరోసారి RH(రోహిణి)-300 సౌండింగ్‌ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. విక్రమ్‌ సారాభాయి అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన ఈ రాకెట్‌ను తిరువనంతపురంలోని తుంబా రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి 2018 ఏప్రిల్‌ 6న ప్రయోగించారు