Telugu Current Affairs Highlights 07 May 2018

Telugu Current Affairs Highlights 07 May 2018

Telugu Current Affairs Highlights 07 May 2018





> మినీ సబ్‌ జూనియర్‌ జాతీయ సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. బాలిక అండర్‌-10, అండర్‌-12, బాలురు అండర్‌-10, అండర్‌-12 విభాగాల్లో విజేతలుగా నిలిచి బంగారు పతకాలు సాధించాయి.
> అంగారకుడి దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన రెండు క్యూబ్‌శాట్‌లు తొలిసారిగా సుదూర విశ్వంలోకి ప్రయాణాన్ని ప్రారంభించాయి
>  ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచిక నివేదికలో స్పష్టత లోపించిందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(PCI) అసహనం వ్యక్తం చేసింది
> పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రాల చరిత్ర అంశంపై ఐఐటీ ఖరగ్‌పుర్‌ కొత్తగా ఓ కోర్సును ప్రారంభించింది. ‘సంధి’ పేరుతో అందిస్తున్న ఈ కోర్సులో ఆధునిక శాస్త్రాలకు పురాతన భారతీయ శాస్త్రాలు అందించిన విజ్ఞానంపై విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు.
> తల్లిదండ్రుల వివాదాల కారణంగా విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న భారతీయ పిల్లలకు తగిన న్యాయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని పంజాబ్‌, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
> పెళ్లి చెల్లకపోయిన ఒక కేసులో భార్యాభర్తలు వయోజనులైనందు వల్ల వారు కలిసి జీవించవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
> తెలంగాణ కళాశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సైన్స్‌ గ్రూపును రద్దు చేసింది.
>తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండం అక్కెనపల్లివారి లింగోటం గ్రామంలో కాకతీయుల కాలం నాటి శిలాశాసనం బయల్పడింది(ఈ శాసనం క్రీస్తుశకం 1246లో వేయించినట్లు గుర్తించారు.)
> అఫ్గానిస్థాన్‌లో పనిచేస్తున్న ఏడుగురు భారతీయులను ప్రభుత్వ ఉద్యోగులుగా పొరబడి తాలిబాన్‌ ఉగ్రవాదులు 2018 మే 6న అపహరించుకుపోయారు. ఉత్తర అఫ్గాన్‌లోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది
> యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) సివిల్‌ సర్వీసు పరీక్ష 2017లో ప్రథమ ర్యాంకు సాధించిన దురుశెట్టి అనుదీప్‌కు 55.6% మార్కులు వచ్చాయి. ప్రధాన పరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులను ఆయన సాధించారు. దీంతో మొత్తంగా 2025కుగాను ఆయన 1,126 మార్కులు తెచ్చుకున్నారు