Telugu Current Affairs Highlights 11 April 2018

847 total views, 1 views today

Telugu Current Affairs Highlights 11 April 2018

Telugu Current Affairs Highlights 11 April 2018

>ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా జపాన్‌కు చెందిన మసాజో నొనాకా గుర్తింపు పొందారు. ఆయన వయసు 112 ఏళ్లు. గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సంస్థ 2018 ఏప్రిల్‌ 10న ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
>యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) నూతన సభ్యురాలిగా 1982 బ్యాచ్‌ కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎం.సత్యవతి నియమితులయ్యారు
>అమరావతి నగర బృహత్తర ప్రణాళిక, ఆకృతికి IGBC గ్రీన్‌ సిటీ ప్లాటినమ్‌ అవార్డు దక్కింది. 2018 ఏప్రిల్‌ 10న జరిగిన ఆనంద నగరాల సదస్సులో IGBC ఛైర్మన్‌ ప్రేమ్‌ సి జైన్‌ ఈ అవార్డును సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు.
>సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా 1994 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రాజేష్‌ రంజన్‌ నియమితులయ్యారు. 2020 నవంబర్‌ 30 వరకు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు
>ఉపగ్రహంలోని కేబుల్‌ వ్యవస్థలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇటీవల భూమితో సిగ్నల్‌ అనుసంధానం కోల్పోయిన జీశాట్‌-6ఏ ఉపగ్రహం జాడను గుర్తించినట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ 2018 ఏప్రిల్‌ 10న వెల్లడించారు
>మొట్టమొదటి ఆనంద నగరాల సదస్సును 2018 ఏప్రిల్‌ 10న ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ప్రారంభించారు. ఈ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ ప్రారంభించారు. 12 వరకు ఈ సదస్సు జరగనుంది.
>ప్రపంచవ్యాప్తంగా 2018 ఏప్రిల్‌ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం నిర్వహించారు. జర్మన్‌ ఫిజిషియన్‌ డా॥ క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ జయంతిని ప్రపంచ హోమియోపతి దినోత్సవంగా నిర్వహిస్తారు
>దేశంలోని జాతీయ పార్టీ ఆదాయ ప్రగతిలో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. రెండేళ్ల (2015-16 నుంచి 2016-17)లో ఆ పార్టీ ఆదాయం 81% పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్‌ ఆదాయం 14% తగ్గింది
>బోవో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా చైర్మన్‌గా ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ ఎన్నికయ్యారు. బాన్‌ కీ మూన్‌ జపాన్‌ ప్రధాని యసువో ఫుకుడాపై విజయం సాధించారు
>దక్షిణాసియాలో 2018 అంతర్జాతీయ మానవ హక్కుల సమావేశం 2018 ఏప్రిల్‌ 9 నుంచి 11 వరకు నేపాల్‌లోని ఖాట్మండ్‌లో నిర్వహించారు
>కార్గిల్‌ యుద్ధంలో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వీరుడు కల్నల్‌ మాగోడ్‌ బసప్ప రవీంద్రనాథ్‌(59) 2018 ఏప్రిల్‌ 10న బెంగళూరులో మృతి చెందారు
>దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికిరణ్‌ జాతీయ పురస్కారాల్లో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట మండలం మరోసారి సత్తాచాటింది. మండలాల కోటాలో సిద్దిపేటకు, గ్రామాల కోటాలో ఇర్కోడ్‌కు అవార్డులు దక్కాయి
>తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. 2018 ఏప్రిల్‌ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
పాన్‌ దరఖాస్తులో ఇకపై ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) తెలిపింది
>నాస్‌కామ్‌ (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌) కొత్త ఛైర్మన్‌గా విప్రో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రిషద్‌ ప్రేమ్‌జీ నియమితులయ్యారు
>ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీ 2018 సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరగబోతోంది. కౌలలాంపూర్‌లో జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు
>రక్తాన్ని సేకరించకుండానే మధుమేహుల గ్లూకోజ్‌ స్థాయి అంచనా వేసే జిగురుపట్టీని బ్రిటన్‌లోని బాత్‌ వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు.>

One thought to “Telugu Current Affairs Highlights 11 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.