Telugu Current Affairs Highlights 12 April 2018

66 total views, 1 views today

Telugu Current Affairs Highlights 12 April 2018

Telugu Current Affairs Highlights 12 April 2018

భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, విజ్ఞానశాస్త్రంలో ఆసక్తి చూపే విద్యార్థులకు జపాన్‌ దేశంలో నిర్వహించే సకురా సైన్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. జపాన్‌-ఆసియా యూత్‌ ఎక్స్‌ఛేంజ్‌ కార్యక్రమం కింద ఈ పర్యటన జరుగుతుంది
2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.3 శాతం ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.6 శాతానికి చేరుతుందని ఏషియన్‌ డెవప్‌మెంట్‌ బ్యాంక్‌(ADB) అంచనా వేసింది
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచాలని నాబార్డు నిర్ణయించింది
వివాహానికి వధువు అంగీకారం తప్పనిసరి అన్నది హిందూ వివాహచట్టంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. పెండ్లి కుమార్తె అంగీకారం లేకుండా, లేదా మోసపూరితంగా జరిగిన హిందూ వివాహాన్ని చట్టరీత్యా చెల్లదని చెప్పనవసరం లేదంది.
ప్రధానమంత్రి ముద్రా యోజన(PMMY) కింద గత మూడేళ్లలో 11 కోట్ల మంది లబ్ధి పొందారని, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ పథకం లక్ష్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్రమోడి తెలిపారు
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం రైతుబంధుకు రూ.6 వేల కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతినిస్తూ వ్యవసాయ శాఖ 2018 ఏప్రిల్‌ 11న ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన కలంకారీ కళాకారుడు మునిరత్నానికి జాతీయ గుర్తింపు లభించింది. ఒక మీటరు వస్త్రంపై 600కు పైగా బొమ్మలతో ఆయన గీసిన హరిశ్చంద్ర కథా ఘట్టాల కళాఖండం 2018 సంవత్సరానికి జాతీయ ఉత్తమ కలంకారీ చిత్రంగా ఎంపికైంది. పురస్కారం కింద రూ.75 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు.
స్వచ్ఛత కోసం కృషి చేసినందుకు తెలుగు రాష్ట్రాల నుంచి జూపల్లి నీరజ (తెలంగాణ), ఆంధ్రప్రదేశ్‌ నుంచి తవణంపల్లె మండలం మత్యంకు చెందిన ఎ.రమేష్‌ ప్రధాని నరేంద్రమోడి నుంచి స్వచ్ఛగ్రాహీ పురస్కారం అందుకున్నారు.
గుంటూరులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ కరవు సంసిద్ధతా పథకం కార్యాలయాన్ని, వెబ్‌పోర్టల్‌ను వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2018 ఏప్రిల్‌ 11న ప్రారంభించారు
కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి పతకాన్ని సాధించిన రాగాల వెంకట రాహుల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.30 లక్షల నజరానాను ప్రకటించారు
తెలంగాణలో అసైన్డ్‌ భూముల సవరణ బిల్లును గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ 2018 ఏప్రిల్‌ 11న ఆమోదించారు

One thought to “Telugu Current Affairs Highlights 12 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.