Telugu Current Affairs Highlights 14 April 2018

Telugu Current Affairs Highlights 14 April 2018

Telugu Current Affairs Highlights 14 April 2018

?ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ICMR) డైరెక్టర్‌ జనరల్‌గా బలరామ్‌ భార్గవ నియమితులయ్యారు
?ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆవిష్కరించారు.ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు
?బయో టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీగా ప్రముఖ శాస్త్రవేత్త రేణు స్వరూప్‌ నియమితులయ్యారు
?జాతీయ సీనియర్‌ కాంపౌండ్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది. పుణేలో 2018 ఏప్రిల్‌ 12న జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత ఒలింపిక్‌ రౌండ్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది
?బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో(BBB) చైర్మన్‌గా భాను ప్రతాప్‌శర్మ నియమితులయ్యారు. BBB తొలి చైర్మన్‌ వినోద్‌రాయ్‌ స్థానంలో భాను ప్రతాప్‌శర్మ నియమితులయ్యారు
?ఔషధాల రూపంలో ఉండి ఉత్ప్రేరకాలుగా వినియోగించే 14 స్టెరాయిడ్‌ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది.
?ఆన్‌లైన్‌లో నెట్‌ బ్యాంకింగ్‌ విధానం ద్వారా భూ మార్పిడి సౌకర్యాన్ని పొందే అవకాశాన్ని శుక్రవారం నుంచి రెవెన్యూ శాఖ కల్పించింది
?వివిధ శాఖల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2017-18లో 4.41%మేర పెరిగింది.
?బీజాపూర్‌లోని గిరిజన ప్రాంతాలను సందర్శించిన తొలి ప్రధాని మోదీనే.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఏర్పాటు చేసిన తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోదీ ఆవిప్రారంభించారు.