Telugu Current Affairs Highlights 15 April 2018

Telugu Current Affairs Highlights 15 April 2018

Telugu Current Affairs Highlights 15 April 2018

మహారాష్ట్రలోని షోలాపూర్‌ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రిలో 2018 ఏప్రిల్‌ 12న ఓ మహిళ రెండు తలల శిశువుకు జన్మనిచ్చింది
స్ఫూర్తి ప్రోగ్రెసివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ కల్చరల్‌ ఫెస్ట్‌ను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 2018 ఏప్రిల్‌ 13న ప్రారంభించారు. ఏప్రిల్‌ 22 వరకు ఈ ఫెస్ట్‌ కొనసాగనుంది.
తెలంగాణ మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ ఎండీగా రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ ఎం.ఎ.వహీద్‌ను ప్రభుత్వం నియమించింది
అమెరికా మార్కెట్లోకి దిగుమతి అవుతున్న కొన్ని ఉత్పత్తులపై పన్ను ప్రయోజన పథకం కింద పన్ను వేయడం లేదని, ఆ తరహాలో వాటిపై సుంకం వేయకుండా ఉండేందుకు భారత్‌కున్న అర్హతపై సమీక్షించాలని అమెరికా నిర్ణయించింది.
జీవితకాలం ఎన్నికల్లో పోటీచేయకుండా పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. పనామా పత్రాలకు సంబంధించిన కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో నవాజ్‌ షరీఫ్‌ను 2017 జులై 28న ప్రధాని పదవి నుంచి కోర్టు తొలగించింది
డెయిరీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టే ఔత్సాహిక రైతులు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ 2018 సంవత్సరానికి అందించే దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ పురస్కారం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు లభించింది
ఎలక్ట్రానిక్‌ డేటా ఇంటర్‌ఛేంజ్‌ లావాదేవీల్లో కాకినాడ కస్టమ్స్‌ హౌస్‌ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది
ఆంధ్రప్రదేశ్‌లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.6,310 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది
ఫైబర్‌ నెట్‌లో కొత్త సినిమా విడుదల, టిక్కెట్ల బుకింగ్‌ కోసం తెలుగు సినిమా నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది
వివిధ శాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2017-18లో 4.41% మేర పెరిగింది
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రి చౌదరి(95) 2018 ఏప్రిల్‌ 13న మృతి చెందారు