Telugu Current Affairs Highlights 16 April 2018

318 total views, 1 views today

Telugu Current Affairs Highlights 16 April 2018

Telugu Current Affairs Highlights 16 April 2018

తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో కొత్త రికార్డు సృష్టిస్తోంది. మేడిగడ్డలో 2018 ఏప్రిల్‌ 14న ఒక్కరోజే 7 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. ఇది ఆసియాలోనే అత్యుత్తమమని అధికారులు వెల్లడించారు.
విశ్వ హిందూ పరిషత్‌ (VHP) నూతన అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ వీఎస్‌ కోక్జే 2018 ఏప్రిల్‌ 14న ఎన్నియ్యారు.
నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వపై ఎత్తిపోతల పథకానికి ఆద్యులు, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్‌ గంటా గోపాల్‌రెడ్డి 2018 ఏప్రిల్‌ 14న మృతి చెందారు.
ప్రముఖ వైద్యుడు, 104, 108 అంబులెన్సు వాహనాల వ్యూహకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ కార్యదర్శి డాక్టర్‌ అయితరాజు పాండురంగారావు(75) 2018 ఏప్రిల్‌ 15న హైదరాబాద్‌లో మృతి చెందారు
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కేంద్ర సహజ వనరులు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2018 ఏప్రిల్‌ 14న తెలంగాణలోని సూర్యాపేటలో ప్రారంభించారు.
ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ శాఖ ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్‌ 14న హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ లుమినరీ లెక్చర్‌ సిరీస్‌ పేరిట ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటిరంగ నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావు పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
గ్రామీణ ప్రాంత ప్రజలు.. ప్రధానంగా దళితులు, గిరిజనులకు చేరువయ్యే దిశగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు వివిధ సంక్షేమ పథకాలతో కూడిన ‘గ్రామస్వరాజ్‌ అభియాన్‌’ను ప్రారంభించాయి. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా 2018 ఏప్రిల్‌ 14న చత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఆయుష్మాన్‌ భారత్‌ సహా వివిధ పథకాలను ప్రారంభించారు.
ప్రధాని నరేంద్రమోడి 2018 ఏప్రిల్‌ 14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హెపటైటిస్‌-సీ వైరస్‌ ఇన్ఫెక్షన్‌ లాంటి కాలేయ వ్యాధులకు కళ్లెంవేసే సరికొత్త చికిత్సా విధానాన్ని పరిశోధకులు కనిపెట్టారు. వైరస్‌పై పోరాడే డైరెక్ట్‌ యాక్టింగ్‌ యాంటీవైరల్‌ ఏజెంట్లు(DAA)ను ఒకేసారి సామూహికంగా ఇవ్వడంతో మంచి ఫలితాలుంటాయని తేల్చారు.
చిత్రదుర్గంలోని శ్రీ మురుఘ రాజేంద్ర బృహన్మఠం ప్రతి సంవత్సరం అందించే బసవశ్రీ పురస్కారాన్ని 2017 సం॥నికి గాను గొర్రెల కాపరి కామేగౌడకు 2018 ఏప్రిల్‌ 15న ప్రదానం చేశారు. ఈ పురస్కారం కింద జ్ఞాపిక, పురస్కార పత్రం, రూ.5 లక్షల చెక్కు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా 5 కోట్ల ఆంధ్రులను దగా చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ రూపొందించిన ఆంధ్రుల ఆత్మగౌరవం గీతాన్ని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విజయవాడలో ఆవిష్కరించారు
సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేవాలయాలకు రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్‌సెట్లు, గొడుగులను రాయితీపై అందిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం 2018 ఏప్రిల్‌ 15న వెల్లడించింది

One thought to “Telugu Current Affairs Highlights 16 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.