Telugu Current Affairs Highlights 17 April 2018

Telugu Current Affairs Highlights 17 April 2018

Telugu Current Affairs Highlights 17 April 2018

మహాత్మాగాంధీ చంపారన్‌ సత్యాగ్రహానికి 100 సం॥లు పూర్తయిన సందర్భంగా స్టీలుతో రూపొందించిన భారీ చరఖాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్‌ బిహార్‌లోని మోతిహరిలో ఆవిష్కరించారు
ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్‌ లోయకు చెందిన ముజఫర్‌ అహ్మద్‌ ఖాన్‌ లెక్కించే పెన్ను కనిపెట్టాడు. రాయడం మొదలుపెట్టిన తర్వాత, పదాలను ఈ పెన్ను లెక్కపెడుతుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువరించిన NIA ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి, 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కె.రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం ఏరియా ఆసుపత్రికి జాతీయ స్థాయి 2017-18 స్వచ్ఛభారత్‌ కాయకల్ప అవార్డు దక్కింది
మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నిందితులుగా ఉన్న అయిదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు చెందిన ప్రత్యేక కోర్టు, 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కె.రవీంద్రకుమార్‌రెడ్డి 2018 ఏప్రిల్‌ 16న తీర్పు వెలువరించారు
ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటిగా పేరుగాంచిన సింధూ నాగరికత 900 సం॥ల పాటు సాగిన సుదీర్ఘ కరవు కారణంగా తుడిచిపెట్టుకుపోయిందని ఐఐటీ-ఖరగ్‌పూర్‌ పరిశోధకులు తేల్చారు. 4,350 ఏళ్ల క్రితం ఈ నాగరికత అంతమైందని నిర్ధారించారు.
ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై మరింత వేగంగా దూసుకుపోవడానికి వీలుగా గరిష్ఠ వేగపరిమితిని ప్రభుత్వం పెంచింది. ఎక్స్‌ప్రెస్‌వేపై వ్యక్తిగత నాలుగు చక్రాల వాహనాలు ఇకపై గంటకు 120 కి.మీ. వేగంతో దూసుకుపోవచ్చు. గతంలో ఇది 100 కి.మీ. మాత్రమే.
పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే ప్రయాణికులకు అన్ని యూఏఈ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసాలు జారీ చేయాలని యూఏఈ కేబినెట్‌ నిర్ణయించింది
తప్పుడు వార్తుల కు చెక్‌ పెట్టే చర్యల్లో భాగంగా ఫేస్‌బుక్‌ అన్ని చర్యలను తీసుకుంటున్నామని నిరూపించుకునేందుకు కర్ణాటక ఎన్నికల్లో పైలెట్‌ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది.
2018 సంవత్సరానికి కందుకూరి రంగస్థల పురస్కార గ్రహీతలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంపిక చేసింది. కందుకూరి వీరేశలింగం 171వ జయంతి సందర్భంగా 2018 ఏప్రిల్‌ 16న విజయవాడలో రాష్ట్ర చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ అంబికా కృష్ణ వివరాలను వెల్లడించారు

One thought to “Telugu Current Affairs Highlights 17 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.