Telugu Current Affairs Highlights 18 April 2018

124 total views, 1 views today

Telugu Current Affairs Highlights 18 April 2018

Telugu Current Affairs Highlights 18 April 2018

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఓ అద్భుత గుహను పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఇసుకరాతి నేలల్లో ఇప్పటివరకు బయటపడ్డ అత్యంత పొడవైన గుహ ఇదే. 24.5 కిలోమీటర్ల పొడవున్న ఈ బిలం పేరు ‘ఖ్రేమ్‌ పురి’. స్థానిక ఖాసీ భాషలో దానికి అర్థం ‘మాయా గుహ’.
2018లో భారత వృద్ధిరేటు 7.4 శాతం ఉంటుందని, 2019లో 7.8 శాతం సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనా వేస్తోంది
శంషాబాద్‌ విమానాశ్రయం కార్గో టెర్మినల్‌కు ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయి పురస్కారం దక్కింది
డెంగీ జ్వరాన్ని నయం చేసే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు.కర్ణాటక బెల్‌గామ్‌లోని కేంద్ర ఆయుర్వేదిక్‌ శాస్త్ర పరిశోధన మండలి (CCRAS)కి చెందిన ప్రాంతీయ కేంద్రం ఇప్పటికే ఈ మందుపై ప్రయోగాత్మక అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తిచేసింది
ప్రముఖ జర్నలిస్టు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత టి.వి.ఆర్‌.షెణాయ్‌(77) 2018 ఏప్రిల్‌ 17న బెంగళూరులో మృతి చెందారు
తెలంగాణలో చేనేత, జౌళి రంగాల అభివృద్ధి కోసం కొత్తగా 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ(THDC), రాష్ట్ర మరమగ్గాలు, జౌళి అభివృద్ధి సంస్థ(TPTDC) పేరిట వీటిని స్థాపించేందుకు ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలో గల ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇత్తడి లోహంతో కళాకృతులను రూపొందిస్తున్న డోక్ర వృత్తిదారుల కళాఖండాలకు, వరంగల్‌లోని చేనేత కార్మికులు రూపొందించే ‘దరీస్‌’కు జీఐ రిజిష్ట్రరీ చెన్నై భౌగోళిక గుర్తింపునిచ్చింది.
హాలీవుడ్‌లో దిగ్గజ నిర్మాత లైంగిక వేధింపుల బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన న్యూయార్క్‌ టైమ్స్‌, న్యూయార్కర్‌ను పులిట్జర్‌ బహుమతి వరించింది
తెగుళ్లను తట్టుకునే ఆధునిక వంగడాల అభివృద్ధికి, బూజు (ఫంగస్‌) కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకునేందుకు పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ మమతాశర్మ, డాక్టర్‌ పూజా భట్నాగర్‌ మాథూర్‌లు ఇక్రిశాట్‌ అత్యున్నత అవార్డు ‘డోరీన్‌ మార్గరెట్‌ మాష్లర్‌-2018’ అందుకోనున్నారు.
ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆదిలాబాద్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి వర్షాధార భూముల్లో సాగుపై (వాలంటరీ డ్రైల్యాండ్‌ అగ్రికల్చర్‌) అఖిల భారత సమన్వయ పరిశోధన పథకాన్ని భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేటాయించింది.
వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల పునరుద్ధరణ.వారిరువురిని బహిష్కరిస్తూ 2018 మార్చి 13న సభ జారీచేసిన ఉత్తర్వులు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు జారీచేసిన ప్రకటనను రద్దుచేసింది

One thought to “Telugu Current Affairs Highlights 18 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.