Telugu Current Affairs Highlights 19 April 2018

Telugu Current Affairs Highlights 19 April 2018

Telugu Current Affairs Highlights 19 April 2018
📌మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 2018 ఏప్రిల్‌ 15 నుంచి 17 వరకు ‘దక్షిణ మధ్య రైల్వే-2022 వైపునకు పరివర్తనా యాత్ర’ నినాదంతో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో దక్షిణ మధ్య రైల్వేకు ప్రథమ బహుమతి లభించింది.
📌 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2,794 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
📌ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, దేశంలోనే తొలిసారి రక్షణేతర రంగం నుంచి శౌర్యచక్ర అవార్డును అందుకున్న ఎం.కమల్‌నాయుడు(79) 2018 ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లో మృతి చెందారు
📌 చంద్రయాన్‌-2 ప్రయోగం వాయిదా పడింది. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని 2018 ఏప్రిల్‌ నెలాఖరులో చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మొదట ప్రణాళికలు రచించింది. అయితే కొన్ని పరీక్షలు చేపట్టాల్సి ఉండటంతో 2018 చివర్లో ప్రయోగం నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఇస్రో అధిపతి కె.శివన్‌ 2018 ఏప్రిల్‌ 18న తెలియజేశారు.
📌 మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం రాసిన మేలుకొలుపు పుస్తకావిష్కరణ కార్యక్రమం 2018 ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లో జరిగింది
📌 మానవుల వెంట్రుకల రంగును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించే 124 జన్యువులను బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు
📌 అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యు. బుష్‌(సీనియర్‌) భార్య బార్బరా బుష్‌(92) 2018 ఏప్రిల్‌ 18న మృతి చెందారు
📌 ప్రపంచ జనాభాలో 95 శాతానికిపైగా మంది అసురక్షిత గాలినే(ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే) పీల్చుకుంటున్నారని హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌(HEI) నివేదిక వెల్లడిం చింది. వాయుకాలుష్యం కారణంగా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో సగానికిపైగా భారత్‌, చైనాల్లోనే చోటుచేసుకుంటున్నాయని తెలిపింది.
📌 తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను 75 శాతం పెంచుతూ విద్యాశాఖ 2018 ఏప్రిల్‌ 18న ఉత్తర్వులు జారీ చేసింది.
📌తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. నూతన చట్టంలోని 9 అంశాలు మినహా మిగతావన్నీ 2018 ఏప్రిల్‌ 18న నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
📌 వర్కింగ్‌ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
📌తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో గల డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు దివంగత నీటిపారుదల సలహాదారు శ్రీ రామరాజు విద్యాసాగర్‌రావు పేరు పెడుతూ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 18న ఉత్తర్వులు జారీ చేసింది.
📌 తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కొత్త లోగోను సంస్థ ఛైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు, ఎండీ అరవింద్‌కుమార్‌లు 2018 ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
📌 ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌ అవార్డు దక్కింది