Telugu Current Affairs Highlights 19 March 2018
Telugu Current Affairs Highlights 19 March 2018
>వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్-2018లో భారత్‌కు 74వ ర్యాంకు లభించింది
>చైనా ప్రధానమంత్రిగా లీ కెకియాంగ్ రెండోసారి ఎన్నికయ్యారు. అధికార కమ్యూనిస్టు పార్టీలో రెండో స్థానంలో ఉన్న లీ(62) మరో ఐదేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు
>దాదాపు 2000 సం॥లకు పూర్వం నాటిదిగా భావిస్తున్న మద్యం నింపి ఉన్న అరుదైన కాంస్య కెటిల్(తేనీటి డికాక్షన్ తయారీ పాత్ర)ను పరిశోధకులు కనుగొన్నారు
>ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో షి యుకి (చైనా), మహిళల్లో తై జు యింగ్ (కొరియా) టైటిళ్లు కైవసం చేసుకున్నారు
>చైనా అధ్యక్షుడిగా జీ జినిపింగ్ రెండో దఫా ఎన్నికయ్యాడు. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(NPC) 2018 మార్చి 17న జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది
>CISF ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది
>1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సంగీత బహదూర్ బెలారస్లో భారత రాయబారిగా నియమితులయ్యారు
>అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల మొబైల్ ప్రచారానికి వినియోగించిన ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ యాప్ 5 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల డేటాను తస్కరించింది
>బాలలపై జరుగుతున్న నేరాలు 2015-16 మధ్యకాంలో 11 శాతానికి పైగా పెరిగినట్లు జాతీయ నేర నమోదు విభాగం(NCRB) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయింది
>ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు
>రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను లెక్కించి, అవి అసలైనవేనని నిర్ధరించుకొని, చించేసినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) తెలిపింది