Telugu Current Affairs Highlights 20 April 2018

Telugu Current Affairs Highlights 20 April 2018

Telugu Current Affairs Highlights 20 April 2018
?హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త పింకీరెడ్డి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) మహిళా ఆర్గనైజేషన్‌(FLO)కు నేషనల్‌ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు
? ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(APERC)కు రాష్ట్ర ప్రభుత్వం సలహా సంఘాన్ని నియమించింది. ఈ కమిటీకి APERC చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ గ్రంధి భవానీ ప్రసాద్‌నే ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా నియమించింది
? డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. పట్టణ, గ్రామీణ పేదలకు నాణ్యత, సృజనాత్మకతతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు హడ్కో అవార్డు ప్రకటించింది.
? ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తులతో టైమ్‌ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులకు చోటుదక్కింది. ఓలా సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ తార దీపికా పదుకొణె, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఈ జాబితాలో ఉన్నారు.
?క్యూబా నూతన అధ్యక్షుడిగా మిగెల్‌ డియాజ్‌ కైనల్‌ ఎన్నికయ్యారు. ఆరు దశాబ్దాల కాలంలో క్యాస్ట్రో కుటుంబేతరుడు అధ్యక్షుడు కావడం ఇదే ప్రథమం
? అలీగఢ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 244 రోజుల వయసున్న చిన్నారికి గాల్‌బ్లాడర్‌లోని రాళ్లను తొలగించడం ద్వారా ఈ రికార్డు సృష్టించారు
?ఉన్నత ప్రమాణాలతో పారిశుద్ధ్యం, పరిశుభ్రత నిర్వహిస్తున్న ఆసుపత్రులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న కాయకల్ప అవార్డుల్లో ఉత్తమ ఆసుపత్రుల విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఆసుపత్రి, అనంతపురం జిల్లా హిందూపురం ఏరియా ఆసుపత్రులకు మొదటి బహుమతి దక్కింది
?3 నెలలకోసారి గ్రామాల్లోని గర్భిణులకు సీమంతం, పసి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది
?ఆంధ్రప్రదేశ్‌లోని కరువు మండలాల్లో ఉపాధి హామీ పనిదినాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 జిల్లాల్లో 98 కరువు మండలాల్లో ఉపాధి 150 రోజులు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది
? ఆక్వాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ‘ఏపీ సెంటర్‌ ఫర్‌ ఆక్వా కల్చర్‌’ పేరుతో ప్రత్యేక సొసైటీని నమోదు చేయించింది
?గృహనిర్మాణ ప్రక్రియలో అవలంభించిన స్ఫూర్తిమంతమైన విధానాలకు గాను కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 19న GHMCకి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డును ప్రకటించింది
?జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(NCLT) హైదరాబాద్‌ సభ్యులుగా రాతకొండ మురళి నియమితులయ్యారు
?ప్రపంచ గొప్ప నేతల జాబితాలో ముకేశ్‌ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ 50 మందితో ఈ జాబితాను రూపొందించగా అందులో ముకేశ్‌కు 24వ స్థానం లభించింది
?హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఉబర్‌ సంస్థ, 24 మెట్రో స్టేషన్లలో కియోస్క్‌లను ఏర్పాటు చేయనుంది
?సౌర కుటుంబం వెలుపల గ్రహాంతర జీవులకు ఆవాసం కల్పించే వీలున్న గ్రహాలను అన్వేషించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తొలిసారిగా ఒక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే శాటిలైట్‌(TESS) అనే ఉపగ్రహం ఆకాశంలో 85 శాతం ప్రాంతాన్ని జల్లెడపడుతుంది