Telugu Current Affairs Highlights 21 April 2018

25 total views, 1 views today

Telugu Current Affairs Highlights 21 April 2018

Telugu Current Affairs Highlights 21 April 2018

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ కలెక్టర్‌ నియామక పత్రాన్ని అందుకున్నాడు. సీసీఎల్‌ఏ కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ 2018 ఏప్రిల్‌ 18న విజయవాడ గొల్లపూడిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో పత్రాన్ని అందించారు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్‌ 20న విజయవాడలో 12 గంటల పాటు ధర్మ పోరాట దీక్ష చేపట్టారు
అటవీ హక్కుల చట్టం(ROFR) పత్రం కలిగి ఉన్న రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుబంధు చెక్కును ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
నాగార్జునసాగర్‌ ఆధునికీకరణలో భాగంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా మర్రిగూడ, చందూర్‌ మండలాల్లోని 14 పంచాయతీల్లో భూగర్భ జవనరుల వృద్ధికి అమలు చేసిన ‘తెలంగాణ భూగర్భ జల వనరుల పరిరక్షణ, నిర్వహణ పైలెట్‌ ప్రాజెక్టు’ ఫలితాల నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు 2018 ఏప్రిల్‌ 20న విడుదల చేశారు
జాతీయ పింఛను పథకం (NPS) చందాదార్లకు బ్యాంక్‌ ఖాతా, మొబైల్‌ నెంబరు తప్పనిసరి చేస్తూ పింఛను నిధి నియంత్రణ, ప్రాథికార మండలి (PFRDA) నిర్ణయం తీసుకుంది.
నాటి సచార్‌ కమిటీ సారధి, డిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజీందర్‌ సచార్‌(94) 2018 ఏప్రిల్‌ 20న డిల్లీలో మృతి చెందారు
ముంబయికి చెందిన వందల కోట్ల ఆస్తిపాస్తులు గల 24 సం॥ల మోక్షేస్‌సేఠ్‌ 2018 ఏప్రిల్‌ 20న వాటిని పరిత్యజించాడు. గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో జైన సన్యాసిగా మారిపోయారు.
గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల టీటీలో 4 పతకాలతో సత్తాచాటిన మనిక బత్రా పేరును అర్జున అవార్డు కోసం భారత టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (TTFI) సిఫార్సు చేసింది
మహిళలపై అకృత్యాలకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న వారిలో 48 మంది వరకు ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) వెల్లడించింది.
బోదకాలు వ్యాధితో బాధపడుతున్నవారికి పింఛను పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో 2018 మే నెల నుంచి పింఛన్లు అందనున్నాయి. వీరికి ప్రతీనెలా రూ.1000 చొప్పున సాయం అందనుంది
టాక్సీలు, ఆటోలు, తేలికపాటి వాహనాలు(LMV) నడిపేందుకు విడిగా కమర్షియల్‌ లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది
ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ స్మారక పురస్కారం 2018 ఈ ఏడాది హైదరాబాద్‌ యువకుడు సయ్యద్‌ ఉస్మాన్‌ అజహర్‌ మక్సూసీని వరించింది.
తెలంగాణకు 4 కాయకల్ప అవార్డులు.ఉన్నత ప్రమాణాలతో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న ఆసుపత్రులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న కాయకల్ప అవార్డుల్లో జిల్లా ఆసుపత్రుల విభాగంలో ఖమ్మం జిల్లా ఆసుపత్రి తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో కింగ్‌కోఠి ఆసుపత్రి నిలిచింది

One thought to “Telugu Current Affairs Highlights 21 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.