Telugu Current Affairs Highlights 22 March 2018
Telugu Current Affairs Highlights 22 March 2018
>17వ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్వర్క్ సదస్సు 2018 మార్చి 21న న్యూడిల్లీలో ప్రారంభమైంది
>2019 జనవరి 3 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బర్కుతుల్లా యూనివర్సిటీలో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించనున్నారు
>రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ 2018 మార్చి 20న న్యూడిల్లీలో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు
>ఇళయరాజా, ముస్తాఫా ఖాన్, పరమేశ్వరన్‌కు పద్మవిభూషణ్‌ను ప్రదానం చేశారు. క్రైస్తవ మతగురువు ఫిల్పోస్ మార్ క్రిసోస్టామ్, పురాతత్వశాస్త్రవేత్త రామచంద్రన్ నాగస్వామి, న్యాయ నిపుణుడు వేద్ ప్రకాశ్ నంద, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు పండిట్ అరవింద్ పరీఖ్‌కు పద్మ భూషణ్ అందించారు
>ముడి, శుద్ధి చేసిన చక్కెరపై ఉన్న 20 శాతం ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది
>దేశవ్యాప్తంగా 62 ఉన్నత విద్యాసంస్థలకు UGC 2018 మార్చి 20న పూర్తి స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది
>అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా అసూరెన్స్ దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆరోగ్య బీమా(మెడిక్లెయిమ్) పాలసీని తీసుకొచ్చింది