Telugu Current Affairs Highlights 23 April 2018

Telugu Current Affairs Highlights 23 April 2018

Telugu Current Affairs Highlights 23 April 2018

?కేంద్ర ప్రభుత్వ పథకం ‘పీఎం మాతృత్వ వందన యోజన పథకం’ పేరును ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లీబిడ్డ చ్లగా’ అని మార్చారు. ఈ పథకానికి 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రం భరిస్తుంది
?దేశంలోనే తొలిసారిగా లోక్‌ అదాలత్‌ బెంచ్‌లో హిజ్రాలకు చోటు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు హిజ్రాలు బి.దుర్గా, ప్రియాంకకు స్థానం కల్పించారు.
?అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి మార్చి 16వ తేదీని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
?ఫెయిర్‌నెస్‌ క్రీములు, ఆయింట్‌మెంట్లను విక్రయించాలంటే డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి అని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది
?దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వారి ఆస్తులను జప్తు చేసేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 ఏప్రిల్‌ 22న ఆమోద ముద్ర వేశారు
?కేన్సర్‌ కారక వైరస్‌ మన DNAలో ఏ విధంగా గట్టిగా అంటుకొని ఉంటుందో అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాస్పోసిస్‌ సార్కోమా-అసోసియేటెడ్‌ హెర్ప్‌వైరస్‌(కేఎస్‌హెచ్‌వీ) అనే అతిచిన్న వైర్‌స్ ను ప్రత్యేక మైక్రోస్కోప్‌ సాయంతో గుర్తించారు.
?దేశంలోని 50 మంది ఐఐటీ పూర్వ విద్యార్థులు ‘బహుజన్‌ ఆజాద్‌ పార్టీ’ పేరిట నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
?జపాన్‌కు చెందిన 117 సం॥ల వృద్ధురాలు నబి తజిమా 2018 ఏప్రిల్‌ 21న మృతి చెందింది. నబి తజిమా 1900 ఆగస్టు 4న కగోషిమా ప్రాంతంలోని కికాయ్‌ ద్వీపంలో జన్మించింది.
?సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు బాలాంత్రపు రజనీకాంతరావు(99) 2018 ఏప్రిల్‌ 22న విజయవాడలో మృతి చెందారు
?సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ చాటింగ్‌ ద్వారా లైంగిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నవారిని గుర్తించే సరికొత్త యంత్ర పరికరాన్ని(క్యాట్‌) అమెరికాలోని పర్ద్యూ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు
?ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ ట్రస్టు లోగోను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్‌ 21న అమరావతిలో ఆవిష్కరించారు
?ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు బిజ్‌స్టోన్‌ తన వ్యక్తిగత హోదాలో డిల్లీకి చెందిన ‘విజిట్‌’ అనే ఆరోగ్య సంరక్షణ స్టార్టప్‌ కంపెనీలో (యాప్‌) పెట్టుబడి పెట్టారు. ఇది ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా పని చేస్తోన్న సంస్థ. 2016లో నలుగురు బిట్స్‌ పిలానీ విద్యార్థులు కలిసి దీన్ని ప్రారంభించారు.
?సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు.