Telugu Current Affairs Highlights 24 April 2018

Telugu Current Affairs Highlights 24 April 2018

Telugu Current Affairs Highlights 24 April 2018
📌వీరోచిత పోరాటం చేసిన సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 ఏప్రిల్ 23న సాహస పురస్కారాలను ప్రదానం చేశారు.
📌జైలుశిక్ష అనుభవిస్తున్న ఈజిప్ట్‌ ఫొటో జర్నలిస్ట్‌ అబూ జైద్‌ అలియాస్‌ షావ్‌కాన్‌ ఐక్యరాజ్యసమితి పత్రికాస్వేచ్ఛ అవార్డును గెలుచుకున్నారు
📌భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, స్టెమ్‌సెల్‌ సైంటిస్టు ప్రొఫెసర్‌ ఏఏ షెట్టి బ్రిటిష్‌ పార్లమెంటు దిగువ సభలో ప్రతిష్ఠాత్మక భారత్‌ గౌరవ్‌ జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
📌ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌ 2018 ఏప్రిల్‌ 23న రెండోసారి పదవీబాధ్యతలు చేపట్టారు
📌తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో ఏగీస్‌ ఆగ్రో కెమికల్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తయారు చేస్తున్న కార్బోఫ్యురాన్‌ 3సీజీ(సోల్‌జర్‌-3జీ) పురుగుల మందును నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
📌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హిదయత్‌ను నియమిస్తూ 2018 ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిదయత్‌ 2 సం॥ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
📌గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌ భవన నిర్మాణ పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు చెల్లించాల్సిన 2,69,49,876కు మినహాయింపునిస్తూ 2018 ఏప్రిల్‌ 23న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
📌శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 2018 ఏప్రిల్‌ 23న బాధ్యతలు స్వీకరించారు
📌జాతీయ లోక్‌అదాత్‌లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 2018 ఏప్రిల్‌ 22న జరిగిన లోక్‌అదాత్‌ కార్యక్రమంలో 31 వేల కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసుల్లో బాధితులకు సుమారు రూ.81 కోట్ల పరిహారం ప్రకటించారు
📌దళిత విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. హాస్టళ్లలో ఉండే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ విద్యార్థులకు నెలనెలా 15 కిలోల బియ్యం, గోధుమలు రాయితీ ధ]రపై ఇవ్వాలని నిర్ణయించింది
📌బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ దంపతులకు 2018 ఏప్రిల్ 23న కుమారుడు జన్మించినట్లు కెన్సింగ్‌టన్‌ రాజప్రాసాదం ఓ ప్రకటన విడుదల చేసింది