Telugu Current Affairs Highlights 24 March 2018

Telugu Current Affairs Highlights 24 March 2018

Telugu Current Affairs Highlights 24 March 2018

📌మొట్టమొదటి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను 2018 మార్చి 23, 24 తేదీల్లో న్యూడిల్లీలో నిర్వహించారు
📌కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ 2018 మార్చి 23న న్యూడిల్లీలో మొట్టమొదటి ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌ డిక్షనరీని ప్రారంభించారు.
📌బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ 2018 మార్చి 22న విజయవంతంగా పరీక్షించింది
📌హైదరాబాద్‌లో ‘విదేశ్‌ ఆయా ప్రదేశ్‌కే ద్వార్‌’ ప్రారంభం
📌విదేశాల నుంచి వచ్చిన డబ్బును మన కరెన్సీలోకి మార్చుకునేందుకు వీలుగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు మూడు నగదు బదిలీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. (మనీగ్రామ్‌, ఆర్‌ఐఏ మనీ ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌ప్రెస్‌ మనీ)
📌హైదరాబాద్‌ ఐఐటీ యువ పరిశోధకులకు గాంధీయన్‌ యంగ్‌ టెక్నలాజికల్‌ ఇన్నోవేషన్‌ (GYTI)’ అవార్డులు లభించాయి
📌మల్టీ వార్‌హెడ్‌ క్షిపణుల అభివృద్ధిని వేగిరపరిచేందుకు దోహదపడే శక్తిమంతమైన క్షిపణి గమన వ్యవస్థను పాకిస్థాన్‌ సొంతం చేసుకుంది. తనకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయినా చైనా నుంచి దీనిని పాక్‌ కొనుగోలు చేసింది
📌ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పారిశ్రామిక పన్ను ప్రోత్సాహకాలను కేంద్రం 2020 మార్చి వరకూ పొడిగించింది
📌తెలంగాణ లో రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకం పేరు గతంలో అనుకున్నట్లు ‘రైతులక్ష్మి’ కాదని ముఖ్యమంత్రి దాన్ని ‘రైతుబంధు’గా మార్చారని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి స్పష్టం చేశారు.
📌టీఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2018 మార్చి 22న న్యూడిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌ థాపర్‌కు ప్రదానం చేశారు
📌భారత పరిశ్రమ సమాఖ్య (CII) అనుబంధ ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ (IWN) తెలంగాణ విభాగం ఛైర్‌ ఉమన్‌గా శోభా దీక్షిత్‌ నియమితులయ్యారు