Telugu Current Affairs Highlights 25 April 2018

Telugu Current Affairs Highlights 25 April 2018

Telugu Current Affairs Highlights 25 April 2018
జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా 2018 ఏప్రిల్‌ 24న మధ్యప్రదేశ్‌లో ‘రాష్ట్రీయ గ్రామస్వరాజ్‌ అభియాన్‌’ను ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు
తెలంగాణ రాష్ట్రంలోని బీసీల స్థితిగతులపై అధ్యయం చేసేందుకు బీసీ కమిషన్‌ 5 సింగిల్‌ బెంచ్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. 2018 ఏప్రిల్‌ 24న బీసీ కమిషన్‌ కార్యాలయంలో సమావేశమై ఈ కమిటీను ఏర్పాటు చేసింది
2019లో భారత్‌ వేదికగా ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ టోర్నీ మన దేశంలో జరగబోతుండడం ఇదే తొలిసారి
పర్యావరణానికి మేు చేకూర్చే చర్యలు చేపడుతున్నందుకుగాను జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ACI ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్ట్స్‌-2018 గుర్తింపు లభించింది
ప్రతి ఏడాది జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రపంచ సైక్లింగ్‌ అలయెన్స్‌ విజ్ఞప్తిని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు డబ్ల్యూసీఏ ప్రకటించింది.
తెలంగాణకు ఈ-పంచాయతీ విశిష్ట పురస్కారం లభించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ప్రధాని మోడి చేతుల మీదుగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ అందుకున్నారు
అడాప్ట్‌ హెరిటేజ్‌ (వారసత్వ కట్టడాల దత్తత) పథకంలో భాగంగా తెలంగాణ నుంచి రామప్ప ఆలయాన్ని కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టుకు దత్తత ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) 2018 ఏప్రిల్‌ 24న ప్రకటించింది.
ఆరోగ్యకర కణజాలానికి హాని జరగకుండా కేన్సర్‌ కణితులకు అధిక మోతాదులో రేడియేషన్‌ పంపి వాటిని నాశనం చేసే సరికొత్త రేడియోథెరపీని అమెరికాలోని వర్సిటీ ఫైన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు
దేశంలో 24 నకిలీ విశ్వవిద్యాయాలు కొనసాగుతున్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) వెల్లడించింది. ఈ మేరకు 2018 ఏప్రిల్‌ 24న జాబితాను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 ఏప్రిల్‌ 24న తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో ‘చంద్రకాంతి’ పథకాన్ని ప్రారంభించారు. ఎల్‌ఈడీ లైట్ల సెంట్రల్‌ లైటింగ్‌ మానిటర్‌ సిస్టమ్‌ ఆన్‌చేసి ‘చంద్రకాంతి’ పథకాన్ని ప్రారంభించారు
అత్యంత దృఢమైన, పర్యావరణహిత, దీర్ఘకాల మన్నిక ఉండే కాంక్రీటును బ్రిటన్‌కు చెందిన ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తయారుచేశారు
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పురుషాంగంతో పాటు వృషణాలతిత్తి శస్త్రచికిత్సను జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. 2006లో తొలిసారిగా చైనాలో పురుషాంగం మార్పిడి శస్త్రచికిత్స మాత్రమే చేశారు
మరణించిన వారికీ గౌరవమర్యాదలుంటాయని, అత్యాచారాల బాధితుల పేర్లు బహిరంగపర్చరాదని సుప్రీంకోర్టు 2018 ఏప్రిల్‌ 24న స్పష్టం చేసింది
గ్రామాల్లో రూ.2 లక్షల్లోపు విలువ గల గృహాకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి లోకేష్‌ ప్రకటించారు.
దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సశక్తీకరణ, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారాలను కృష్ణా జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌, వివిధ పంచాయతీ సర్పంచులు అందుకున్నారు.
అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ ఆధ్వర్యంలో 2019 జూన్‌ 26 నుంచి జులై 3 వరకూ హైదరాబాద్‌ హైటెక్స్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహించనున్నారు.
12 సం॥ లోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవారికి మరణదండన విధించడానికి ఉద్దేశించిన అత్యవసరాదేశానికి జమ్ముకశ్మీర్‌ మంత్రిమండలి 2018 ఏప్రిల్‌ 24న ఆమోదం తెలిపింది.
ప్రారంభ స్థాయిలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో టై హైదరాబాద్‌ చొరవ చూపిన రైస్‌ యూనివర్సిటీ ఛాలెంజ్‌లో డబ్ల్యూసీబీ రోబోటిక్స్‌ విజయం సాధించింది. బహుళ అంతస్తు భవనాల్లోని కిటికీలను శుభ్రం చేసే రోబోను ఆవిష్కరించిన ఈ స్టార్టప్ సంస్థ వ్యవస్థాపకుడు ఉజ్వల్‌ అగర్వాల్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అభినందించారు.
సూర్యుడికి అత్యంత దూరంలో నీలి-ఆకుపచ్చ రంగులో ఉండే యురేనస్‌ గ్రహాన్ని హానికర వాయువులతో కూడిన మేఘాలు ఆవరించి ఉన్నట్టుగా తాజా అధ్యయనంలో వెల్లడైంది
భారత వాయుసేన తన అణు పోరాట సామర్థ్యాన్ని పరీక్షించుకుంది. అణు, క్రిమియుద్ధం తలెత్తే సందర్భాల్లో సన్నద్ధత, సామర్థ్యం స్థాయిని పరీక్షించుకునేందుకు 2018 ఏప్రిల్‌ 8 నుంచి 20 వరకు 13 రోజుల పాటు ‘గగన్‌శక్తి’ పేరిట భారీ సైనిక విన్యాసాలను చేపట్టింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.10 లక్షల కోట్లు దాటాయని కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 24న వెల్లడించింది
భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త ఒకరు దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన పన్ను రహిత లక్కీడ్రాలో సుమారు రూ.6.38 కోట్లు గెలుచుకున్నారు
గుజరాత్‌లో గల భావ్‌నగర్‌ జిల్లాలోని 12 గ్రామాలకు చెందిన 5,259 మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, గుజరాత్‌ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు