Telugu Current Affairs Highlights 25 March 2018

Telugu Current Affairs Highlights 25 March 2018

Telugu Current Affairs Highlights 25 March 2018

📌దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది
📌ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీ సమీపంలోని మదనపాలెం సమీపంలో 636 ఎకరాల్లో నిర్మించబోయే హీరో మోటోకార్ప్‌ మొదటిదశ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 మార్చి 23న శంకుస్థాపన చేశారు
📌కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల ఏర్పాటు చేసిన తెలుగు సలహామండలిలో ప్రముఖ కవి యాకూబ్‌కు స్థానం కల్పించారు
📌అమెరికా జాతీయ భద్రత సలహాదారు పదవి నుంచి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హెచ్‌ఆర్‌ మెక్‌మాస్టర్‌ను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలగించారు. ఆ స్థానంలో గతంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన జాన్‌ బోల్టన్‌ను నియమించారు.
📌ఇజ్రాయెల్‌కు తొలిసారిగా ఎయిర్‌ ఇండియా తన విమాన సేవలను ప్రారంభించింది
📌తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జీవితంలో అనేక ఘట్టాలను పొందుపరుస్తూ భూపాలపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ బొట్ల మహర్షి రచించిన ‘కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణం’ పుస్తకాన్ని 2018 మార్చి 23న డిల్లీలో జేఎన్‌యూ వైస్‌ ఛాన్స్‌లర్‌ జగదీశ్‌ కుమార్‌ ఆవిష్కరించారు.
📌బీసీసీఐ సౌత్‌జోన్‌ అంతర్‌ రాష్ట్ర మహిళ అండర్‌-23 టీ20 లీగ్‌ క్రికెట్‌లో ఆంధ్ర సత్తాచాటింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర సౌత్‌జోన్‌ ఛాంపియన్‌గా నిలిచింది.
📌తెలంగాణలోని సిద్దిపేటలో గల శ్రీసాయి తేజ స్లమ్‌ సమాఖ్యకు స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ అవార్డు భించింది
📌GMR హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(GHIAL) ప్రారంభించి 10 సం॥లు అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవ కార్యక్రమాన్ని జీఎంఆర్‌ గ్రూప్‌ 2018 మార్చి 23న నిర్వహించింది
📌తెలంగాణలో 2018 మార్చి 23న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మూడింటిని కైవసం చేసుకుంది
📌తెలంగాణలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 23న నిర్ణయం తీసుకుంది