Telugu Current Affairs Highlights 26 April 2018

Telugu Current Affairs Highlights 26 April 2018

Telugu Current Affairs Highlights 26 April 2018

>పత్రికా స్వేచ్ఛలో భారత్‌ 138వ స్థానంలో నిలిచింది. 180 దేశాల్లోని పత్రికాస్వేచ్ఛ ఇతర పరిస్థితులపై రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ 2018 ఏప్రిల్‌ 25న వార్షిక నివేదికను వెల్లడించింది.
>ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల్లో గృహనిర్మాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి హడ్కో అవార్డులు లభించాయి. 48వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2018 ఏప్రిల్‌ 25న డిల్లీలో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి, హడ్కో ఛైర్మన్‌ రవికాంత్‌లు అవార్డు అందజేశారు.
>తెలంగాణకు 5 హౌసింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) అవార్డులు లభించాయి. 2018 ఏప్రిల్‌ 25న డిల్లీలో 48వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ, హడ్కో ఛైర్మన్‌ రవికాంత్‌ ఈ అవార్డును అందజేశారు.
>తెంగాణలోని సిద్దిపేట మార్కెట్‌ యార్డు ISO 9001:2015 సర్టిఫికెట్‌ సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మార్కెట్‌ యార్డు సిద్దిపేట మార్కెట్‌ యార్డు.
>డేటా ఉల్లంఘన అంశంపై మరిన్ని వివరాలు కోరుతూ కేంబ్రిడ్జ్‌ అనలిటికా(CA), ఫేస్‌బుక్‌ సంస్థలకు భారత ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 25న రెండోసారి నోటీసు పంపించింది
>జీశాట్‌-11 ఉపగ్రహ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వాయిదా వేసింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి మేలో దీన్ని నింగిలోకి పంపాలని మొదట నిర్ణయించారు.
>తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోస్ట్‌గార్డ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్‌ 25న ఇంటర్‌ సెప్టర్‌ బోట్‌ చార్లీ-438(సి-438)ను ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎం.మాలకొండయ్య ప్రారంభించారు
>కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన భారత ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతుల అభివృద్ధి మండలి (ఫార్మెక్సిల్‌) ఫార్మా, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి 2018 మే 8 నుంచి 10 వరకు అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించనుంది. డిల్లీలో ‘IPHEX-2018 ’ పేరుతో ఈ ప్రదర్శన జరగనుంది.
>కేంద్ర టెలికాం శాఖ ఇకపై భారతీయ ప్రామాణిక కాలమానాన్ని అనుసరించనుంది. ఈ విషయమై శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి-జాతీయ భౌతిక ప్రయోగశాల, టెలికాంశాఖలు 2018 ఏప్రిల్ 25న ఒప్పందం చేసుకున్నాయి
>సరిహద్దు భద్రతా దళం(BSF)కు చెందిన డేర్‌ డెవిల్స్‌ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. BSF ఇన్స్‌పెక్టర్‌ అవదేశ్‌ కుమార్‌ సింగ్‌, కానిస్టేబుల్‌ ధ్రువేశ్‌ బాబులు 10 గంటల 34 నిమిషాల పాటు ద్విచక్ర వాహనాలపై 16.5 అడుగుల నిచ్చెనలాంటి స్థూపంపై పలు విన్యాసాలు చేసి రికార్డులకెక్కారు
>మహారాష్ట్ర అదనపు డీజీపీ, CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ 28 ఏళ్ల సుదీర్ఘ సేవలు ముగిశాయి. స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) కోరుతూ లక్ష్మీనారాయణ చేసుకున్న దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది
>క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, స్మృతి మంధానను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
>కాకతీయుల కాలం నాటి ఓ శాసనం తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వెలుగుచూసింది
>రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ షెడ్యూల్‌లోని నిబంధన కింద రక్షణ.
>జపాన్‌, దక్షిణ కొరియాకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ద్వారా ఇనుప ఖనిజం ఎగుమతికి ఉద్దేశించిన దీర్ఘకాలిక ఒప్పందానికి ఆమోదం.
>భారత్‌, దక్షిణాఫ్రికా ద్వీపకల్ప దేశమయిన సావోటోమ్‌ మధ్య ఔషధ మొక్కల సరఫరాకు కుదిరిన ఒప్పందానికి ఆమోదం.
>పునర్‌వ్యవస్థీకరించిన జాతీయ వెదురు కార్యక్రమాని(NBM)కి కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 25న ఆమోదం తెలిపింది

One thought to “Telugu Current Affairs Highlights 26 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.