Telugu Current Affairs Highlights 27 April 2018

27 total views, 2 views today

Telugu Current Affairs Highlights 27 April 2018

Telugu Current Affairs Highlights 27 April 2018





>అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తూ మెరుగైన సేవల కోసం తెలంగాణ మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబరు 155209ను ప్రారంభించింది
>ప్రొఫెసర్‌ సీహెచ్‌ హనుమంతరావు రచించిన ‘మై జర్నీ ఫ్రమ్‌ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్‌ సోషలిజం: సమ్‌ మెమొరీస్‌, రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ఇన్‌క్ల్యూజివ్‌ గ్రోత్‌’ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2018 ఏప్రిల్‌ 26న డిల్లీలో ఆవిష్కరించారు.
>ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయిన ఛాంపియన్స్‌ ట్రోఫీని ఐసీసీ రద్దు చేసింది. 2021లో భారత్‌లో జరగాల్సి ఉన్న ఈ టోర్నీ స్థానంలో ప్రపంచ టీ20ని నిర్వహించాలని నిర్ణయించింది
>పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులపై నమోదయ్యే క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ 2018 ఏప్రిల్‌ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రాష్ట్రం మొత్తాన్ని ఒకే యూనిట్‌గా గుర్తించి సెషన్స్‌ జడ్జి స్థాయిలో హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నారు.
>ద్రోణాచార్య అవార్డుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. కోహ్లీకి రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న, సునీల్‌ గావస్కర్‌కు ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది.
>హైదరాబాద్‌ యూనివర్సిటీ కోర్టు సభ్యులుగా రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు.
>రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పునరుద్ధరించారు. బీజేపీ సభ్యుడు నారాయణలాల్‌ పంచారియా ఛైర్మన్‌గా పనిచేసే ఈ కమిటీలో సభ్యులుగా టీఆర్‌ఎస్‌ నేత కె.కేశవరావు, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత సుజనాచౌదరిలను నియమించారు.
>భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భైచుంగ్‌ భూటియా ‘హమ్రో సిక్కిం’ పేరుతో 2018 ఏప్రిల్‌ 26న నూతన రాజకీయ పార్టీని ప్రారంభించారు
>బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌తో విభేదాలొచ్చి జనతాదళ్‌(యు) నుంచి విడిపోయిన శరద్‌యాదవ్‌ కొత్త పార్టీ లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌(ఎల్‌జేడీ)ను స్థాపించారు
>సీపీఐ 23వ మహాసభలు కేరళలోని కొల్లాంలో 2018 ఏప్రిల్‌ 26న ప్రారంభమయ్యాయి. 29 వరకు ఈ మహాసభలు జరగనున్నాయి

One thought to “Telugu Current Affairs Highlights 27 April 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.