Telugu Current Affairs Highlights 28 April 2018

Telugu Current Affairs Highlights 28 April 2018

Telugu Current Affairs Highlights 28 April 2018





>కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడిగా సికింద్రాబాద్‌కు చెందిన సమన్యుయాదవ్‌ గిన్నిస్‌బుక్‌ రికార్డు నెలకొల్పాడు
>తెలంగాణ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సిక్కిరెడ్డి పేరును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అర్జున అవార్డుకు సిఫారసు చేసింది
>ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. గత 70 ఏళ్లుగా వైరంతో రగిలిపోయిన ఆ రెండు దాయాది దేశాలు 2018 ఏప్రిల్‌ 27న శాశ్వత శాంతి దిశగా ముందడుగు వేశాయి
>ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కవితా సంకలనం ‘వాఖర్‌’ 2017 సం॥నికి గాను సరస్వతి సమ్మాన్‌ అవార్డు గెలుచుకుంది. లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌ సి.కశ్యప్‌ నేతృత్వంలోని కమిటీ ఈ ఎంపిక చేసింది
>సివిల్‌ సర్వీసెస్‌-2017 ఫలితాల్లో తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు
>ప్రముఖ రచయిత, పండితుల శ్రీపాద కృష్ణమూర్తి (85) 2018 ఏప్రిల్‌ 27న విశాఖపట్నంలో మృతి చెందాడు
>సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్ర 2018 ఏప్రిల్‌ 27న ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు.
>కామాంధుడి బారి నుంచి మహిళను రక్షించిన రైల్వే రక్షక దళానికి చెందిన కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అతడికి సాహస అవార్డుతో పాటు రూ.లక్ష నగదు బహూకరించడానికి కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ అంగీకరించారు
>భారత్‌లో మత స్వేచ్ఛ వాతావరణం 2017లో మరింత దిగజారిందని అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మతస్వేచ్ఛ కమిషన్‌ అభిప్రాయపడింది
>హైదరాబాద్‌లోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని మాదాపూర్‌ నుంచి అమీర్‌పేటకు మార్చారు