Telugu Current Affairs Highlights 28 March 2018

Telugu Current Affairs Highlights 28 March 2018

Telugu Current Affairs Highlights 28 March 2018

>ఓటర్లలో జాగృతి కల్పించేందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి రాహుల్‌ ద్రవిడ్‌ను విశేష రాయబారిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించింది
>‘సమాచార దుర్వినియోగ’ వివాదంలో చిక్కుకున్న ఫేస్‌బుక్‌ ప్రజలకు క్షమాపణు చెబుతూ బ్రిటన్‌ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
>విదేశీ పర్యటనల కోసం ప్రధానమంత్రి వినియోగించిన విమానాల వివరాలు కోరుతూ సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం కింద దాఖలైన దరఖాస్తును జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియా తిరస్కరించింది
>తెలంగాణ శాసనసభ సచివాలయం రూపొందించిన 5 పుస్తకాలను స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, మండలి ఉపఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ తదితరులు 2018 మార్చి 25న ఆవిష్కరించారు.
>దేశంలోని 34 ప్రైవేటు థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని, దీనివల్ల బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1.74 లక్షల కోట్లు మొండిబకాయిలు(ఎన్‌పీఏ)గా మారడానికి అవకాశాలున్నాయని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని ఇంధనశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది