Telugu Current Affairs Highlights 29 March 2018

Telugu Current Affairs Highlights 29 March 2018

Telugu Current Affairs Highlights 29 March 2018

>మయన్మార్‌ నూతన అధ్యక్షుడిగా విన్‌ మ్యింట్‌ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకుంది
>దేశవ్యాప్తంగా 2017లో జరిగిన మతఘర్షణల్లో తెలంగాణ రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది
>దేశ రక్షణ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన సాహస యోధులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ 2018 మార్చి 27న శౌర్య అవార్డులను ప్రదానం చేశారు.
>ఫోర్బ్స్‌ ఆసియా ప్రతిభావంతుల జాబితాలో స్టార్‌ షట్లర్‌ సింధు, భారత మహిళల జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానకు చోటు లభించింది
>తెలంగాణ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 27న ఉత్తర్వులు జారీ చేసింది
>ఎస్‌బీఐ కార్డ్‌ వైద్యుల కోసం ప్రత్యేకంగా క్రెడిట్‌ కార్డుల్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌తో జత కట్టింది
>పోలీసు శాఖకు చెందిన వివిధ విభాగాల్లో ఉత్తమ శిక్షణ ఇచ్చిన సిబ్బందికి కేంద్ర హోంమంత్రి పేరుతో ఇచ్చే అవార్డులను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అందజేశారు
>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిషనరేట్‌లో మొదటగా సైబర్‌ ల్యాబ్‌ను సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో 2018 మార్చి 27న ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి ఈ-కార్యాలయం సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌.
>వయోజనుల పరస్పర అంగీకారంతో చేసుకునే వివాహాల్లో జోక్యం చేసుకోకుండా ఖాప్‌ పంచాయతీలపై సుప్రీంకోర్టు 2018 మార్చి 27న నిషేధం విధించింది
>పౌరహక్కుల ఉద్యమకారిణి, 1954లో అమెరికాలోని ప్రభుత్వ పాఠశాల్లో జాతి వివక్షపై న్యాయపోరాటం చేసి చరిత్రాత్మక తీర్పునకు కారణమై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న లిండా బ్రౌన్‌ (76) మరణించారు
>గత ఆరు నెలల్లో పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న, 2018 ఏప్రిల్‌-జులై నెల మధ్య కాలంలో పదవీ విరమణ చేయనున్న మొత్తం 85 మంది రాజ్యసభ సభ్యులకు 2018 మార్చి 27న వీడ్కోలు ఇచ్చారు
>యూఏఈలో మరో భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ నిర్వహించిన ఓ లాటరీలో పాతికేళ్ల ధనీష్‌ కొథరంబన్‌ 2018 మార్చి 27న మొదటి బహుమతి గెలుచుకున్నారు. దీనికింద ఆయనకు దాదాపు రూ.6.5 కోట్లు దక్కనున్నాయి.
>ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ 2018 మార్చి 25 నుంచి 28 వరకు చైనాలో రహస్యంగా పర్యటించారు
>వినూత్న ఆలోచనలతో, సోషల్‌ మీడియా స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటు చేయాలనుకునే వారికి సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్‌ ముందుకొస్తోంది