Telugu Current Affairs Highlights 30 April 2018
Telugu Current Affairs Highlights 30 April 2018
>దేశ రాజకీయాల్లో 2018 ఏప్రిల్ 29న సరికొత్త రికార్డు నమోదైంది. అత్యంత సుదీర్ఘకాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన నేతగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌చామ్లింగ్ చరిత్ర సృష్టించారు. ఇన్నాళ్లు కమ్యూనిష్టు కురువృద్ధుడు జ్యోతిబసు పేరుమీదున్న రికార్డును చెరిపేసి పవన్ తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు
>భారత్-పాకిస్థాన్‌లు తొలిసారిగా సైనిక విన్యాసాల్లో కలిసి పాల్గొనబోతున్నాయి. 2018 సెప్టెంబరులో రష్యాలో జరగబోయే విన్యాసాల్లో చైనా సహా అనేక దేశాలు పాల్గొంటాయి
>జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్ 2018 ఏప్రిల్ 29న తన పదవికి రాజీనామా చేశారు.
>నెయ్మార్ జూనియర్ ఫైవ్ ఫుట్‌బాల్ టోర్నీలో జాగో బొనిటో ముంబయి జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌లో 2018 ఏప్రిల్ 29న నిర్వహించిన ఫైనల్లో ముంబయి కలింగ రేంజర్స్ ఎఫ్‌సీ పుణేపై విజయం సాధించింది
>యువతలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలకు ఆర్ఎస్ఎస్ శ్రీకారం చుట్టింది. ‘ఆర్ఎస్ఎస్లో చేరండి’ పేరుతో తమ వెబ్సైట్ ప్రారంభించింది
>భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకరరెడ్డి (76) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
>తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. జయలలిత వర్గం అనే అర్థాన్నిచ్చేలా ‘అమ్మఅణి’ పేరుతో శశికళ తమ్ముడు దివాకరన్ 2018 ఏప్రిల్ 29న ఈ పార్టీని ప్రారంభించారు
>తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కళా రంగానికి దిక్సూచిగా నిలిచిన కళాశ్రమ వ్యవస్థాపకులు రవీంద్రశర్మ గురూజీ(65) 2018 ఏప్రిల్ 29న మృతి చెందారు.
>ముంబయి తీవ్రవాద దాడి కేసు విచారణ నుంచి చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న చౌధ్రీ అజహర్‌ను పాకిస్థాన్ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ హఠాత్తుగా తప్పించేసింది.
>కేదార్నాథ్ ఆలయం మహాద్వారాలను 2018 ఏప్రిల్ 29న తెరిచారు. శీతాకాలం మొదలవగానే మూసివేసిన ఈ ఆలయాన్ని 6 నెలల అనంతరం తిరిగి తెరిచారు
>ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి 2018 ఏప్రిల్ 28న హైదరాబాద్‌లో మృతిచెందారు
>గుజరాత్లో హిందువులుగా కొనసాగుతున్న 450 మంది దళితులు 2018 ఏప్రిల్ 29న బౌద్ధమతం స్వీకరించారు
>కార్మికు భద్రతే లక్ష్యంగా ప్రతిపాదించిన కార్మిక కోడ్‌పై అభిప్రాయాలను సమర్పించాల్సిన గడువును కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ 2018 మే 31వ తేదీ వరకు పొడిగించింది