Telugu Current Affairs Highlights 31 March 2018

Telugu Current Affairs Highlights 31 March 2018

Telugu Current Affairs Highlights 31 March 2018

>భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2018 మార్చి 29న ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లురు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి చేపట్టిన GSLV-F08 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది
>తెలంగాణ శాసనసభ, మండలి 9వ సెషన్‌ సమావేశాలు 2018 మార్చి 29న ముగిశాయి
>మానవ శరీరంలో ఓ కొత్త ‘అవయవాన్ని’ తాము గుర్తించినట్లు అమెరికాలోని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకటించారు. ‘ఇంటర్‌స్టిటియం’గా పిలుస్తున్న ఈ ‘అవయవం’.. మన దేహంలో పు ముఖ్యమైన అవయవాలు, కణజాలాల చుట్టూ విస్తరించి ఉంటుందని వెల్లడించారు
>తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలో అక్షయ పాత్ర సంస్థ, ఇన్ఫోసిస్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ‘మెగా కిచెన్‌’ కేంద్రాన్ని 2018 మార్చి 30న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు
>బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్యూటీ కలెక్టర్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు
>జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (NCERT) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై 2019 నుంచి QR (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ను ముద్రించనున్నట్లు కేంద్ర మంత్రి జవదేకర్‌ చెప్పారు
>మాస్కోలోని 23 దేశాలకు చెందిన కొంతమంది దౌత్యవేత్తలను రష్యా 2018 మార్చి 30న బహిష్కరించింది
>ఐపీఎల్‌ 11వ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహిస్తాడు
>దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 45 గ్రామీణ ప్రాంత రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు
>తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సి.దామోదర్‌రెడ్డి విజయం సాధించారు