Telugu Current Affairs One Liners 02 August 2018

26 total views, 2 views today

Telugu Current Affairs One Liners 02 August 2018

Telugu Current Affairs One Liners 02 August 2018
 •  ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం లోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
 • కుష్టు వ్యాధి సోకిందని భాగస్వామికి విడాకులు ఇవ్వడం ఇకపై కుదరదు. ఇందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది
 • ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అందుకున్న నజ్మాహెప్తుల్లా(2013), గులాం నబీ ఆజాద్(2015), బర్తృహరి మెహతాబ్(2017), దినేశ్ త్రివేది(2016), హుకుమ్‌దేవ్ నారాయణ్‌సింగ్(2014).
 • తక్షణ తలాక్‌ను నిషేధిస్తూ భారత సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై గగ్గోలు రేగింది. ఇప్పుడు ముస్లిం దేశమైన పాకిస్థాన్‌ కూడా భారత్‌ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. విడాకులు ఇవ్వడానికి పురుషులు సాధనంగా ఎంచుకుంటున్న తక్షణ తలాక్‌ పద్ధతిపై పాక్‌ ఇస్లామిక్‌ వ్యవహారాల న్యాయ సలహా మండలి (CII-Council of Islamic Ideology) దృష్టి పెట్టింది
 • రెజ్లర్లకు మద్దతిచ్చేందుకు ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్‌ ముందుకొచ్చింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకొంది
 • ఆసియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లు ‘నో నీడిల్‌ పాలసీ’కి కట్టుబడి ఉండాలని భారత ఒలింపిక్‌ సంఘం (IOA-Indian Olympic Association) ఆదేశించింది.
 • గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4,383 కొత్త పంచాయతీలు ఉనికిలోకి వచ్చాయి
 • విశాఖలో గతేడాది డిసెంబర్‌ 16 నుంచి 18 వరకు నగరంలో అంతర్జాతీయ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యూమానిటీ(టెక్‌) సదస్సు దిగ్విజయంగా నిర్వహించారు.ఈ ఏడాది నవంబర్‌ 15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 • ధూపదీపనైవేద్యంపథకం రాష్ట్రంలోని మూడు వేల ఆలయాల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ధూపదీపనైవేద్యం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ప్రతి ఆలయానికి నెలకు రూ.6 వేలు అందజేయనున్నారు.
 • వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మానుగొండ గ్రామ పరిధిలో చేపడుతున్న కొనాయిమాకుల లిఫ్టు స్కీం సవరణ అంచనా వ్యయానికి ప్రభుత్వం బుధవారం పాలనా ఆమోదం తెలిపింది.
 • తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకు కేంద్రీయ విద్యాలయం (కేవీ) మంజూరైంది. సిద్దిపేటతోపాటు దేశవ్యాప్తంగా మరో 12 కేవీలను కేంద్ర ప్రభు త్వం మంజూరుచేసింది.

  Daily Current Affairs PDF

One thought to “Telugu Current Affairs One Liners 02 August 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.