Telugu Current Affairs One Liners 02 July 2018

Telugu Current Affairs One Liners 02 July 2018

Telugu Current Affairs One Liners 02 July 2018

📌కేన్సర్‌ను చటుక్కున గుర్తించే బ్రెత్‌ బయాప్సీ అనే పరికరాన్ని బిల్లీ బాయల్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త అభివృద్ధి చేశాడు

📌తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపులో సింగరేణి మొదటి స్థానంలో నిలిచింది.జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 జూలై 1 నుంచి 2018 మార్చి నాటికి హైదరాబాద్‌ జోన్‌లో రూ. 2,100 కోట్లను చెల్లించి అవార్డు అందుకుంది.

📌తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీ గంగారంలోని టీఎస్‌ఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సంజీవ్‌కుమార్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు

📌భారతదేశంలో 19,569 భాషలు లేదా మాండలికాల్లో మాట్లాడుతున్నట్లు జనాభా లెక్కలపై విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి

📌గ్రామాల్లోని పశువుల విసర్జితాలు, ఇళ్ల నుంచి వచ్చే చెత్త, పొలాల్లోని వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువులు, బయోగ్యాస్‌, విద్యుత్‌ తయారు చేసి సంపదను సృష్టించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘గోబర్‌-ధాన్‌’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.దీని కింద తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది

📌ఒక దుకాణంలో ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకోవడంలో మనకు సాయపడే ఒక కొత్త “ద ఫుడ్‌స్విచ్‌” యాప్‌ను ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

📌ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 100 సంస్థల మార్కెట్‌ విలువ 20 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.1360 లక్షల కోట్లు) స్థాయికి చేరిందని పీడబ్ల్యుసీ సర్వేలో తేలింది

📌ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వెంకటేశ్వర ఆలయం హర్యానాలోని కురుక్షేత్రలో నిర్మితమైంది

📌స్విస్‌ బ్యాంకులో 2017లో వివిధ దేశాల పౌరులు జమ చేసిన సొమ్ము ఆధారంగా జరిపిన విశ్లేషణలో భారత్‌ 73వ స్థానంలో నిలిచింది

📌రొమ్ము కేన్సర్‌ను తగ్గించే గుణాలు వేపలో పుష్కలంగా ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువైంది. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ సంస్థ(నైపర్‌) శాస్త్రవేత్తలు సాగించిన పరిశోధనలో వేపను కేన్సర్‌ నివారిణిగా గుర్తించారు

📌ECIL సీఎండీగా నావికాదళం రిటైర్డ్‌ మాజీ అధికారి రియర్‌ అడ్మిరల్‌ సంజయ్‌ చౌబే నియమితులయ్యారు

📌పాకిస్థాన్‌లో తొలిసారిగా ఓ సిక్కు యువకుడు టీవీ యాంకరయ్యాడు. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చకేసార్‌ పట్టణానికి చెందిన హర్మీత్‌సింగ్‌ కరాచీలోని ఉర్దూ విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో మాస్టర్స్‌ చదివాడు

For Daily Quiz

Daily Current Affairs PDF