Telugu Current Affairs One Liners 03 July 2018

Telugu Current Affairs One Liners 03 July 2018

Telugu Current Affairs One Liners 03 July 2018




డిల్లీ మరియు డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రముఖ జర్నలిస్టు, హిందీ న్యూస్‌ టీవీ ఛానల్‌ ఇండియా టీవీ ఛైర్మన్‌ మరియు చీఫ్‌ ఎడిటర్‌ రజత్‌ శర్మ ఎన్నికయ్యారు

యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ నూతన డైరెక్టర్‌ అండ్‌ జనరల్‌ మేనేజర్‌గా కేబీ విజయ్‌ శ్రీనివాస్‌ బాధ్యతలు చేపట్టారు

కావేరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ మొట్టమొదటి సమావేశం 2018 జులై 2న న్యూడిల్లీలోని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించారు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అరిజిత్‌ బసు 2018 జులై 2న బాధ్యతలు చేపట్టారు

షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ రంగంలో అందించిన సేవలకు గాను ఉమెన్‌ ప్రొఫెషనల్‌గా లైనర్‌ అండ్‌ ప్యాసెంజర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ సంగీత శర్మకు ఇండియా మేరీటైమ్‌ అవార్డు లభించింది

పాఠశాల విద్యార్థుల కోసం ‘హ్యాపీనెస్‌ కరిక్యులమ్‌’ (కొత్త తరహా సిలబస్‌)ను డిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది

మెక్సికో అధ్యక్షుడిగా నేషనల్‌ రీజెనరేషన్‌ మూవ్‌మెంట్‌ పార్టీ నేత, 64 ఏళ్ల వామపక్ష దిగ్గజం ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఆబ్రేడర్‌ (ఆమ్లో) ఘన విజయం సాధించారు

భారత పారా అథ్లెట్‌ యోగేశ్‌ కతునియా డిస్కస్‌ త్రోలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రిలో పురుషుల డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ డిస్క్‌ను 45.18 మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు

భారత క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌లకు ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది

సెయిల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరుగా (సీఎండీ) సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సరస్వతీ ప్రసాద్‌ అదనపు బాధ్యతలు స్వీకరించారు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సమన్వయ కమిటీకి ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌(ఐఈఎక్స్‌) ఎక్సలెన్స్‌ అవార్డు దక్కింది

For Daily Quiz

Daily Current Affairs PDF