Telugu Current Affairs One Liners 04 July 2018

Telugu Current Affairs One Liners 04 July 2018

Telugu Current Affairs One Liners 04 July 2018




భారత తొలి ఖగోళ పరిశీలక ఉపగ్రహం ‘ఆస్ట్రోశాట్‌’ సుదూర విశ్వంలోని అద్భుత దృశ్యాలను క్లిక్‌మనిపించింది

మర మనుషుల కోసం స్పర్శజ్ఞానం కలిగిన చర్మాన్ని అభివృద్ధి చేస్తున్న భారత సంతతి పరిశోధకుడు రవీందర్‌ దహియా రూ.13.55 కోట్ల (1.5 మిలియన్ల పౌండ్లు) ప్రోత్సాహకాన్ని గెలుచుకున్నారు

జీఎస్టీ అక్రమాలను కనిపెట్టేందుకు ‘జీఎస్టీ వెరిఫై’ పేరుతో యాప్‌ అందుబాటులోకి వచ్చింది

యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ శిఖా శర్మ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4.88 కోట్ల వేతనం అందుకున్నట్లు బ్యాంకు వార్షిక నివేదికలో వెల్లడించింది

భారత నౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్‌ జె.జి.నాదకర్ణి(86) 2018 జులై 2న ముంబయిలో మృతి చెందారు

ప్రభుత్వ ఉద్యోగుల 11వ వేతన సవరణ సంఘం కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అశుతోష్‌ మిశ్రాను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2018 జులై 3న ఉత్తర్వులు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందజేస్తున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జాతీయ పురస్కారానికి ప్రముఖ వయొలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి ఎంపికయ్యారు

ఎన్నికల్లో అక్రమాలపై రహస్యంగా ఫిర్యాదు చేసేందుకు ఓటర్ల కోసం ఒక ప్రత్యేక యాప్‌ ‘‘సీవిజిల్‌’’ను ఎన్నిక కమిషన్‌ (ఈసీ) రూపొందించింది

బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్‌(క్యూఎస్‌) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో అమెరికాలకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎమ్‌ఐటీ) వరుసగా ఏడోసారి మొదటి స్థానంలో నిలిచింది

ఉగాండా ప్రభుత్వం 2018 జులై 1న అధికారికంగా సోషల్‌ మీడియా ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించింది

For Daily Quiz

Daily Current Affairs PDF