Telugu Current Affairs One Liners 04 June 2018

Telugu Current Affairs One Liners 04 June 2018

Telugu Current Affairs One Liners 04 June 2018




?భారత్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5ను 2018 జూన్‌ 3న విజయవంతంగా పరీక్షించింది
?తెలంగాణలోని సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లిలో రూ.175 కోట్ల అంచనా వ్యయంతో మలేసియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ కంపెనీ ద్వారా సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు
?అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ పదవికి భారత సంతతి యువకుడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శుభమ్‌ గోయల్‌(22) పోటీకి దిగాడు.
?168 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గడిపిన ముగ్గురు వ్యోమగాములు 2018 జూన్‌ 3న క్షేమంగా కజికిస్థాన్‌లో దిగారు
?తాజ్‌మహల్‌ చుట్టూ ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నిషేధించడానికి ఉద్దేశించిన ‘తాజ్‌ ప్రకటన’ 2018 జూన్‌ 3న ఆమోదం పొందింది
?ఉగ్రవాదంతో అతలాకుతలం అవుతున్న అఫ్గానిస్థాన్‌లో దాదాపు సగంమంది బాలబాలిలకు విద్యకు దూరంగా ఉంటున్నారని యునిసెఫ్‌ నివేదిక వెల్లడించింది
?పైనాపిల్‌ పులావ్‌, మొక్కజొన్న పులావ్‌, చికెన్‌ కూర, చేపలు, రొయ్యల కూర వంటి రకరకాల భారతీయ వంటకాల వివరాలు, ధరను చేతితో రాసి ఉన్న 1809 నాటి మెనూ కార్డు లండన్‌లో జరిగిన వేలంలో దాదాపు రూ.ఏడున్నర లక్షల పైచిలుకు ధర పలికింది
?జన్యుపరమైన ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆకలిని నిరోధించడం ద్వారా బరువు తగ్గడంలో దోహదపడగల సరికొత్త ఔషధాన్ని ‘లిరాగ్లుటైడ్‌’ శాస్త్రవేత్తలు గుర్తించారు
?వ్యవసాయ వనరుల పరిశోధన, విపత్తు పర్యవేక్షణ కోసం చైనా 2018 జూన్‌ 2న అధునాతన భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. గావోఫెన్‌-6 అనే ఈ ఉపగ్రహం లాంగ్‌ మార్చ్‌-2డీ ద్వారా జివుక్వాన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లింది.