Telugu Current Affairs One Liners 05 July 2018

29 total views, 3 views today

Telugu Current Affairs One Liners 05 July 2018

Telugu Current Affairs One Liners 05 July 2018




హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 12వ ఛాన్స్‌లర్‌గా జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నియమితులయ్యారు

అమెరికాలో మాదక ద్రవ్యాల రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ నూతన యాక్టింగ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో-అమెరికన్‌ న్యాయవాది ఉత్తమ్‌ ధిల్లాన్‌ ఎంపికయ్యారు

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) పేరు మారింది. ఇక నుంచి ‘సాయ్‌’ను ‘స్పోర్ట్స్‌ ఇండియా’గా పిలవనున్నారు

భారత్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ చైనా శాఖను ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2018 జులై 4న లైసెన్సును జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఎలక్ట్రానిక్స్‌ తయారీ సముదాయంలో కంపెనీ ఏర్పాటుకు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఆస్ట్రమ్‌ అంగీకరించింది

తెలంగాణ ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ల మధ్య ఐటీ ఆధారిత, బ్లాక్‌చైన్‌, ఇతర నూతన సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందం జరిగింది

నీటిపారుద సహా అన్ని ఇంజినీరింగ్‌ పనుల్లో 12శాతం జీఎస్టీ చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టును భూ సేకరణ చట్టం పరిధి నుంచి మినహాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది

డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించేందుకు విజయవాడ సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రి మొబైల్‌ పరీక్షా కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది

For Daily Quiz

Daily Current Affairs PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.