Telugu Current Affairs One Liners 06 July 2018
Telugu Current Affairs One Liners 06 July 2018
విద్యుత్తు రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా రాష్ట్ర విద్యుత్తు శాఖకు ఎకనామిక్ టైమ్స్ వార్షిక అవార్డు దక్కింది
పునరుత్పాదక శక్తి రంగంలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎకనామిక్ టైమ్స్ అవార్డు దక్కింది
రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు గుర్తింపు కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ డిజీ లాకర్లో ఉంచిన ఆధార్, చోదక అనుమతి (డ్రైవింగ్ లైసెన్స్) సాఫ్ట్ కాపీలను చూపిస్తే సరిపోతుందని రైల్వేశాఖ ప్రకటించింది.
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా(ఏఐ) 2018 జులై 5న కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్(రిపబ్లిక్ ఆఫ్ చైనా) పేరును తమ అధికారిక వెబ్సైట్లో చైనీస్ తైపీగా మార్పు చేసింది
ఇంటర్నెట్ సమాచారాన్ని మోసుకుపోయే ఫైబర్ ఆప్టిక్స్‌ను భూకంపాన్ని గుర్తించే సెన్సార్లుగా మార్చే అధునాతన వ్యస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 2018 జులై 5న విధానసభలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రైతులు జాతీయ, సహకార బ్యాంకు నుంచి తీసుకున్న పంట రుణాల్ని రూ.2 లక్షల వరకూ మాఫీ చేశారు
మొక్కల జిగురుతో పటిష్ఠమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయొచ్చని పరిశోధకులు కనిపెట్టారు. పర్యావరణంలో ఇట్టే కలిసిపోవడం దీని ప్రత్యేకత
వదంతుల వ్యాప్తిని అరికట్టే పరిష్కారానికి వాట్సాప్ రూ.34లక్షల బహుమతి
బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు
అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే దిశగా భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) తొలి అడుగు వేసింది.ప్రయోగానికి కొద్దిసేపటి ముందు లేదా ప్రయోగించిన వెంటనే ఏదైనా ఉపద్రవం తలెత్తితే.. వ్యోమగాములను సురక్షితంగా తప్పించే ‘ప్యాడ్ అబార్ట్’ ప్రయోగాన్ని నిర్వహించింది