Telugu Current Affairs One Liners 07 August 2018

Telugu Current Affairs One Liners 07 August 2018

Telugu Current Affairs One Liners 07 August 2018





?ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదింది. దీని ప్రకారం అట్రాసిటీ కేసులో అరెస్టుకు ప్రాథమిక విచారణ అవసరం లేదు

?జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించే కీలకమైన బిల్లును రాజ్యసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది

?జమ్మూకశ్మీర్ వాసులకు ప్రత్యేకాధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35-ఏపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 27తర్వాత విచారణను చేపడుతామని ప్రకటించింది.

?తాము రూపొందించిన అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్-11ను నవంబర్ 30వ తేదీన ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తామని ఇస్రో ప్రకటించింది. దీని బరువు 5,700 కిలోలు

?చైనా మరో కొత్త తరం సూపర్ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. ఇది సెకనుకు క్విటిల్లియాన్ లెక్కలు చేయగలుగుతుందని ప్రభుత్వ అధికార పత్రిక జిన్హువా తెలిపింది. 1 పక్కన 18 సున్నాలు పెడితే (quintillion) క్విటిల్లియాన్‌తో సమానం. దీనిని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ప్యార్‌లల్ కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషన్ సూపర్‌కంప్యూటింగ్ సెంటర్, నేషనల్ లేబొరేటరీ ఫర్ మెరైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి అభివృద్ధి చేశాయి. దీనికి ద సన్‌వే ఎక్సాస్కేల్ కంప్యూటర్ అని పేరుపెట్టారు.

?భూగ్రహంపై మూడో అత్యధిక వేడి సంవత్సరంగా 2017ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికంటే ముందు 2016, 2015 అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డు నెలకొల్పాయి

?తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతున్న ఆలిండియా ఇంటర్‌-ఇనిస్టిట్యూషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్ లో హైదరాబాద్‌ కుర్రాడు స్నేహిత్‌ రజత పతకం సాధించాడు.

?భారత క్రీడాకారిణి స్వస్తికా ఘోష్‌ హాంకాంగ్‌ జూనియర్స్‌ క్యాడెట్‌ ఓపెన్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో సత్తా చాటింది. సింగపూర్‌కు చెందిన జింగ్యిజో తో జతకట్టిన స్వస్తిక గర్ల్స్‌ జూనియర్స్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్యం సాధించింది

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF

One thought to “Telugu Current Affairs One Liners 07 August 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.