Telugu Current Affairs One Liners 07 June 2018

Telugu Current Affairs One Liners 07 June 2018

Telugu Current Affairs One Liners 07 June 2018



?జోర్డాన్‌ ప్రధానమంత్రిగా ఒమర్‌ రజాజ్‌ నియమితులయ్యారు. వరల్డ్‌ బ్యాంక్‌ సీనియర్‌ అధికారి అయిన ఒమర్‌ రజాజ్‌ను జోర్డాన్‌ ప్రధానిగా నియమిస్తూ ఆ దేశ రాజు 2వ అబ్దుల్లా ఆదేశాలు జారీ చేశారుv
?మలేసియా అటార్నీ జనరల్‌గా భారత సంతతికి చెందిన క్రిస్టియన్‌ లాయర్‌ టామీ థామస్‌ నియమితులయ్యారు
?ఎర్లీ చైల్డ్‌హుడ్‌ డెవలప్‌మెంట్‌పై 2018 ఆసియా`పసిఫిక్‌ రీజనల్‌ కాన్ఫరెన్స్‌ను నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో 2018 జూన్‌ 5 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించారు
?కేంద్ర ప్రభుత్వ పథకం అటల్‌ భూజల్‌ యోజనకు వరల్డ్‌ బ్యాంక్‌ రూ.6000 కోట్లు కేటాయించింది
?ఈజిప్టు అధ్యక్షుడిగా అబ్దెల్‌ ఫతేహ్ అల్‌-సిసీ రెండోసారి ఎన్నికయ్యారు. 2018 మార్చిలో జరిగిన ఎన్నికల్లో అబ్దెల్‌ ఫతేహ్ అల్‌-సిసీ విజయం సాధించాడు
?పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంతల అభివృద్ధి (ఎంపీ ల్యాడ్‌) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్‌ కమిటీలో తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడ రవీంద్రకుమార్‌కు చోటు దక్కింది
?న్యూధిల్లిలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో విరాట్‌ కోహ్లి మైనపు ప్రతిమను ఆవిష్కరించారు
?భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లి 2018 సంవత్సరానికిగాను ప్రపంచంలోని అత్యంత ఆర్జన గల 100 మంది క్రీడాకారుల ఫోర్బ్స్‌ జాబితాలో మళ్లీ చోటు దక్కించుకున్నాడు(83వ)
?దక్షిణాఫ్రికాలో ఉండగా అహింసా సిద్ధాంతాన్ని మహాత్ముడు ఆవిష్కరించిన చరిత్రాత్మక ఫీనిక్స్‌ సెటిల్‌మెంట్‌(డర్బన్‌లో ఉన్న)లో భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ 2018 జూన్‌ 6న ఓ మొక్క(కేప్‌ చెస్ట్‌నట్‌)ను నాటారు
?ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2018 జూన్‌ 6న న్యూడిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది
?ప్రపంచ శాంతి సూచీ-2018లో భారత్‌కు 136వ స్థానం లభించింది. 2017లో 137వ ర్యాంకు, 2016లో 141వ ర్యాంకు వచ్చింది
?ఆర్‌బీఐ 2018 జూన్‌ 4న ఫైనాన్సియల్‌ లిటరసీ వీక్‌ను ప్రారంభించింది. ఆర్‌బీఐ 2018 ఫైనాన్సియల్‌ లిటరసీ వీక్‌ థీమ్‌ -Customer Protection
?కోణార్క్‌ తీరంలోని చంద్రభాగ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ లభించింది.
దీంతో ఈ ఘనత సాధించిందిన ఆసియాలో కెల్ల మొట్టమొదటి బీచ్‌గా చంద్రభాగ బీచ్‌ ఘనత సాధించింది
?2018 బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశం 2018 జూన్‌ 4న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించారు
?పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్లాస్టిక్‌రహిత రాష్ట్రాలుగా ఆవిర్భవించాలని తమిళనాడు, నాగాలాండ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌ నిర్ణయించాయి
?స్పెయిన్‌ నూతన ప్రధానమంత్రిగా పెడ్రో సాంచెజ్‌ ప్రమాణ స్వీకారం చేశారు