Telugu Current Affairs One Liners 08 August 2018

Telugu Current Affairs One Liners 08 August 2018

Telugu Current Affairs One Liners 08 August 2018





📌భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మంగళవారం జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కే ఎం జోసఫ్‌ల చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు

📌ఆరవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ఆస్ర్టేలియా తెలుగు సంఘం, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ హ్యూస్టస్‌ ఆమెరికా సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్‌ 3, 4 తేదీల్లో మెల్‌బోర్న్‌లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

📌పేద విద్యార్థినులు డిగ్రీ చదివేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకుగాను సంతూర్‌ ‘విమెన్స్‌ స్కాలర్‌షిప్‌’ ప్రోగ్రామ్‌ను విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ అందుబాటులోకి తెచ్చింది

📌కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రచించిన ‘టెన్‌ ఐడియాలజీస్‌’ పుస్తకాన్ని 2018 ఆగస్టు 7న న్యూడిల్లీ లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు

📌ఎస్కార్ట్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా నిఖిల్‌ నందా నియామకమయ్యారు. నిఖిల్‌ తండ్రి రాజన్‌ నందా అనారోగ్యంతో మరణించడంతో ఆయన వారసుడిగా ఆ స్థానంలో నియమితులయ్యారు.

📌రక్షణ, భద్రత అవసరాల కోసం స్వాధీనం చేసుకునే స్థిరాస్తులపై పరిహార చెల్లింపు నిబంధనలు మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF