Telugu Current Affairs One Liners 08 June 2018

71 total views, 1 views today

Telugu Current Affairs One Liners 08 June 2018

Telugu Current Affairs One Liners 08 June 2018



?కేంద్రం కృషి కళ్యాణ్‌ అభియాన్‌ పథకాన్ని తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం జిల్లాల్లో అమలు చేయనుంది
?అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన భారత ఆటగాడికి బీసీసీఐ ఇచ్చే పాలి ఉమ్రిగర్‌ అవార్డును 2016-17, 2017-2018 సీజన్‌కు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గెలుచుకున్నాడు
?స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పూర్తికి ఏపీ, సింగపూర్‌ల ఒప్పందం
?బ్రిక్స్‌ దేశాల్లోని తొలి 20 అగ్రవర్సిటీల జాబితాలో 4 భారత విద్యాసంస్థలు చోటు సంపాదించాయి. ఐఐటీ బాంబే (9), ఐఐఎస్‌సీ బెంగళూరు (10), ఐఐటీ డిల్లీ (17), ఐఐటీ మద్రాస్‌ (18) ఈ ఘనత సాధించాయి.
?కంప్యూటర్‌ రంగంలో క్లౌడ్‌ సేవలను సముద్ర గర్భం నుంచి అందించేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమవుతోంది
?రైల్‌టెల్‌ సహకారంతో దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో ప్రజలకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ 2018 జూన్‌ 7న వెల్లడించింది
?దేశంలోని 137 నదీతీరాల్లో తాము నాటబోయే 65000 మొక్కలకు పర్యావరణ అభిమానులైన వారి పేర్లను పెట్టాలని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నిర్ణయించింది
?సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(COAI-కాయ్‌) నూతన ఛైర్మన్‌గా వొడాఫోన్‌ ఎండీ, సీఈఓ సునీల్‌ సూద్‌ను నియమించారు
?అత్యధిక శాతం మహిళా మంత్రులున్న యూరప్‌ దేశంగా స్పెయిన్‌ చరిత్ర సృష్టించింది
?ఒక్క రోజులో 4,914 కరివేపాకు మొక్కలను పంచి కేరళకు చెందిన సుదీష్‌ గురువాయూర్‌ గిన్నిస్‌ రికార్డు సాధించాడు
?సచివాలయ ఉద్యోగులకు సురక్షితమైన తాగునీటిని అందజేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించింది
?11వ జియో ఇంటలిజెన్స్‌ ఆసియాను 2018 జూన్‌ 4, 5 తేదీల్లో న్యూడిల్లీలో నిర్వహించారు. 11వ జియో ఇంటలిజెన్స్‌ ఆసియా థీమ్‌ – GeoSpatial : A Force Multiplier for Defence and Industrial Security
?బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌కు 19వ ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు-2018 లభించింది
?ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతికశాఖ పరిధిలో ఉన్న నాటక అకాడమీకి 11 మంది సభ్యులను నియమిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

One thought to “Telugu Current Affairs One Liners 08 June 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.