Telugu Current Affairs One Liners 08 May 2018

Telugu Current Affairs One Liners 08 May 2018

Telugu Current Affairs One Liners 08 May 2018

>రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ (65) 2018 మే 7న నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పటికే దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన ఈ హోదాలో ఉన్నారు
>మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని 2018 మే 7న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు
>తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌ అద్భుతం సృష్టించారు. 202 రంగులు గల కాటన్‌, పాలిస్టర్‌ చీరను మరమగ్గంపై నేశారు. 5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు, 400 గ్రాముల బరువుతో దీన్ని తయారుచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
>ఫిక్కీ మహిళా విభాగం రూపొందించిన ‘సంఘటిత రంగంలో స్త్రీ-పురుష సమానత్వ సూచిక’ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూడిల్లీలో 2018 మే 7న విడుదల చేశారు.
>విశ్వభారతి విశ్వవిద్యాలయం దేశికోత్తమ పురస్కారానికి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ పేరును ప్రతిపాదించింది. ఆయనతో పాటు ప్రఖ్యాత కవి గుల్జార్‌, రచయితలు అమితవ్‌ఘోష్‌, సునితి కుమార్‌ పాఠక్‌ తదితరుల పేర్లను నామినేట్‌ చేశారు.
>కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోకి మాజీ ఎంపీల ప్రవేశంపై డిల్లీలో నియంత్రణ విధించారు. ఇదివరకు ఎంపీలు, మాజీ ఎంపీలు ఐడీ కార్డు చూపించి కేంద్ర ప్రభుత్వ అధికారుల వద్దకు నేరుగా వెళ్లడానికి స్వేచ్ఛ ఉండేది.
>రాజ్యసభ తరచూ వాయిదాలు పడకుండా కార్యకలాపాలు మరింత మెరుగ్గా, సజావుగా కొనసాగేలా నిబంధనల పునఃపరిశీలనకు ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్‌ వీకే అగ్నిహోత్రి నేతృత్వంలో న్యాయశాఖ రిటైర్డ్‌ సంయుక్త కార్యదర్శి ఎస్‌.ఆర్‌.ధలేతాతో కూడిన కమిటీ వివిధ అంశాలను సమీక్షిస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ దేశ్‌ దీపక్‌ వర్మ వెల్లడించారు.
>కేబినెట్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ సిన్హా (62) పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు 2018 మే 7న అధికారిక ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన గల నియామకాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది
>తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి ఉన్న ప్రాంతంలో స్మారక మందిరం నిర్మాణానికి 2018 మే 7న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌స్వెల్వం శంకుస్థాపన చేశారు
>జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు మార్చాలని సుప్రీం కోర్టు 2018 మే 7న ఆదేశించింది.
>వేలమంది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులను దగ్గర చేసేందుకు వారధిలా పనిచేసినట్లు ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ‘‘సజెస్టెడ్‌ ఫ్రెండ్స్‌’’ పేరుతో ఫేస్‌బుక్‌ వినియోగదారులకు అందిస్తున్న సేవలు ఉగ్రవాదులకు చక్కగా తోడ్పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.
> భారత్‌లో బీటీ పత్తి విత్తనాలపై తమ పేటెంట్‌ హక్కులు కొనసాగించాలని అమెరికాకు చెందిన మాన్‌శాంటో కంపెనీ చేసిన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలపలేదు