Telugu Current Affairs One Liners 09 May 2018

Telugu Current Affairs One Liners 09 May 2018

Telugu Current Affairs One Liners 09 May 2018

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.42,324కి పెరిగింది. 2016-17తో పోలిస్తే 2017-18లో 10 శాతానికి పైగా అధికమైంది
ఐజీఎంఎస్‌ఏ ఫిడే బిలో 1500 రేటింగ్‌ చెస్‌ టోర్నీలో కె.బాలకృష్ణ విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఓపెన్‌ విభాగంలో 9 రౌండ్లు ముగిసిన తర్వాత 8 పాయింట్లు సాధించిన బాలకృష్ణ టైటిల్‌ గెలిచాడు
థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మహిళల జట్టుకు సైనా నెహ్వాల్‌, పురుషుల బృందానికి హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సారథులుగా ఎంపికయ్యారు.
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నందున, 2018లో 7.2%, 2019లో 7.4% చొప్పున వృద్ధి నమోదు కావచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
బ్రిటన్‌లోని టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల సంఘం అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారుపై నాణేలను రూపొందించారు. 2018 మే 8న హైదరాబాద్‌లో వాటిని సీఎంకు అందజేశారు.
పర్యావరణ హిత నిర్మాణాలపై నిర్వహించే జాతీయ సదస్సు గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-2018కు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 2018 అక్టోబరు 31 నుంచి నవంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు హెచ్‌ఐసీసీ వేదికగా ఈ సదస్సు జరగుతుంది
హస్తకళల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని గుండ్లపోచంపల్లి అపారెల్‌ పార్కులో ఏర్పాటు చేయాలని తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు
కేంద్ర సమాచార శాఖ ఆధ్వరంలో 2018 మే 10 నుంచి 12 వరకు డిల్లీలో ‘ఆసియా మీడియా సదస్సు’ను నిర్వహించనున్నారు. ‘టెల్లింగ్‌ అవర్‌ స్టోరీస్‌-ఏసియా అండ్‌ మోర్‌’ అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో ఆసియా పరిధిలో సమాచార, ప్రసార రంగంలో ఎదురౌతున్న సవాళ్లు, సహకారంపై చర్చించనున్నారు
దేశవ్యాప్తంగా లైంగిక దాడి బాధితుల్లో 5-10 శాతం మందికే సంబంధిత పథకాల కింద పరిహారం అందుతోందని వెల్లడయింది
కైలాష్‌ మానసరోవర్‌ యాత్ర నేపథ్యంలో నాథూలా పాస్‌ను తిరిగి రాకపోకల నిమిత్తం తెరిచినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ 2018 మే 8న ప్రకటించారు
అత్యంత అరుదుగా మెడ లోపలి భాగంలోని ఎముకపై ఏర్పడే కణితిని ప్రపంచంలోనే తొలిసారిగా రోబో సాయంతో వైద్యులు విజయవంతంగా తొలగించారు. అమెరికాలోని భారత సంతతి వైద్యుడు నీల్‌ మల్హోత్రా నేతృత్వంలోని శస్త్రచికిత్సా నిపుణుల బృందం ఈ చికిత్స నిర్వహించింది.
ఏడాది నుంచి 10 సం॥ల కాలపరిమితి గల రిటైల్‌ డిపాజిట్లపై వడ్డీరేటును ఆంధ్రాబ్యాంకు 10-25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.
ఆర్మీనియా దేశ నూతన ప్రధానిగా నికోల్‌ పాష్నియాన్‌ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడైన ఆయనను 2018 మే 8న ఆ దేశ పార్లమెంటు ప్రధాని పదవికి ఎన్నుకుంది
గతంలో ఎన్నడూ కనిపించని 100కు పైగా కొత్త జాతుల జీవులను బెర్ముడా తీరంలోని మహాసముద్ర ప్రాంతంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు
ఊబకాయంతో మూత్రపిండాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించే ఔషధాల తయారీ దిశగా విస్తృత పరిశోధనలు చేసేందుకుగాను భారతీయ అమెరికన్‌ ప్రొఫెసర్‌ తాహిర్‌ హుస్సేన్‌కు నేషనల్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ నుంచి దాదాపు రూ.10.7 కోట్ల భారీ మొత్తం మంజూరైంది
18 ఏళ్లకు పైబడిన వయసున్న మహిళలు డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సౌదీ అరేబియా అనుమతించింది. దీంతో 2018 జూన్‌ 24 నుంచి సౌదీలో మహిళలు వాహనాలు నడపవచ్చు
దివ్యాంగులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం రూ.167.5 కోట్లతో AI for Accessibility కార్యక్రమాన్ని చేపట్టింది
బంగాళాఖాతం గర్భంలో భారీ స్థాయిలో ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నట్లు భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) పరిశోధనల్లో వెల్లడైంది.
చరిత్రాత్మకమైన పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఇపుడు ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి కూడా వైదొలగింది