Telugu Current Affairs One Liners 10 July 2018

29 total views, 3 views today

Telugu Current Affairs One Liners 10 July 2018

Telugu Current Affairs One Liners 10 July 2018




?తాజ్‌మహల్‌లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు 2018 జులై 9న ఆదేశించింది
 
?శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్‌ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్‌ పేషంట్‌’ గోల్డెన్‌ మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌గెలుచుకుంది
 
?కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 6 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ‘ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌(IOE)’ హోదా కల్పించింది
 
?రకరకాల HIVఇన్‌ఫెక్షన్ల నుంచి సమర్ధంగా కాపాడగలిగే సరికొత్త వ్యాక్సిన్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. దీనిని వారు ‘మొజాయిక్‌’ వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు
 
?క్రియాశీలక పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్‌బీ శ్రీహరి(89) 2018 జులై 9న మృతి చెందారు
 
?ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు(బ్యాంబూ) బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
 
?దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ శామ్‌సంగ్‌, ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ ప్లాంటును నోయిడాలో నిర్మించింది
 
?తెలంగాణలో గ్రామపంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది
 
?లోకాయుక్త బిల్లుకు తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపింది.
 
?పోలవరం ప్రాజెక్టు సలహాదారుగా రమేశ్‌బాబును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

One thought to “Telugu Current Affairs One Liners 10 July 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.