Telugu Current Affairs One Liners 11 June 2018

Telugu Current Affairs One Liners 11 June 2018

Telugu Current Affairs One Liners 11 June 2018?సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, NIA మాజీ సారథి శరద్‌కుమార్‌(62)ను విజిలెన్స్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.
?UPSC తాత్కాలిక ఛైర్మన్‌గా అరవింద్‌ సక్సేనా నియమితులయ్యారు. 2018 జూన్‌ 20 నుంచి తదుపరి ఉత్తర్వులు అందేవరకు లేదా 2020 ఆగస్టు 7తో పూర్తి కానున్న ఆయన పదవీకాలం వరకు బాధ్యతలు చేపడతారని కేంద్ర ప్రభుత్వం 2018 జూన్‌ 10న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
?ఆంధ్రప్రదేశ్‌ కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మ్యారేజెస్‌ (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌- 2018ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
?భారత్‌లోని 16 రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు యురేనియంతో భారీగా కాలుష్యమైనట్లు అధ్యయనంలో వెల్లడైంది.
?ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాల కోటాలో బెల్జియం, డొమినికన్‌ రిపబ్లిక్‌, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా ఎన్నికయ్యాయి.
?రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ 2018 జూన్‌ 8న చెన్నై రాజా అన్నామలైపురంలో ‘యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ’ని ప్రారంభించారు.
?తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలను ఆయుష్‌ వైద్యానికి కూడా విస్తరించాలని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు నిర్ణయించింది.
?విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రాణాలు అర్పించిన హర్విందర్‌సింగ్‌ అనే కేంద్ర రిజర్వు పోలీసు దళం (CRPF) జవానుకు ప్రధానమంత్రి పోలీసు పతకం దక్కింది.
?దేశీయ భోఫోర్స్‌గా పిలుస్తున్న తొలి భారతీయ దీర్ఘశ్రేణి శతఘ్ని ధనుష్‌ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుంది.
?రోమన్‌, శాతవాహన, మౌర్యచక్రవర్తుల కాలానికి చెందిన ఖరీదైన పనిముట్లు, పరికరాలు , నాణేలకు తొలిచారిత్రక యుగస్థావరంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల పెద్దబొంకూర్‌ గ్రామం నిలుస్తోందని రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనశాలల శాఖ వెల్లడించింది.
?విపత్తులను సమగ్రంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాధికార సంస్థ, జిల్లా స్థాయిలో జిల్లా విపత్తుల నిర్వహణ సాధికార సంస్థ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
?భూమికి 600 కాంతి సంవత్సరాల దూరంలో K2-236 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
?పర్యావరణానికి హానికరమైన గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌లో శాస్త్రవేత్తలు గొర్రెలపై దృష్టిసారించారు. మీథేన్‌ను తక్కువగా విడుదల చేసే సరికొత్త జాతి గొర్రెలను సృష్టించారు.
?నగరాల్లోని మురికి నీటిలో మలినాలను 24 గంటల్లోనే వడపోసే సరికొత్త పదార్థాలను పరిశోధకులు గుర్తించారు. నీటి సమస్యకు ఇవి చక్కటి పరిష్కారం చూపే అవకాశముంది. స్పెయిన్‌లోని సెవిల్లీ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు.