Telugu Current Affairs One Liners 12 June 2018

116 total views, 1 views today

Telugu Current Affairs One Liners 12 June 2018

Telugu Current Affairs One Liners 12 June 2018



?టెక్నాలజీ రంగంలో అత్యధిక ఉద్యోగావకాశాలున్న నగరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉన్నట్లు జాబ్‌పోర్టల్‌ ఇండీడ్‌ నివేదిక వెల్లడించింది
?గుండెపోటు లక్షణాలను తొలి దశల్లోనే కనిపెట్టడంలో తోడ్పడే యాప్‌ ‘సేవ్‌’ను ఆస్ట్రేలియాలోని ఫ్లిండెర్స్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు
?హైదరాబాద్‌ నైపర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌) సంస్థకు డైరెక్టర్‌గా డాక్టర్‌ శశి బాలాసింగ్‌ 2018 జూన్‌ 11న బాధ్యతలు చేపట్టారు
?ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌ కంప్యూటర్‌ను అమెరికా ఆవిష్కరించింది. దీనికి ‘సమిట్‌’గా నామకరణం చేసింది. చైనాకు చెందిన ‘సన్‌వే తైహులైట్‌’ రికార్డును దీని సాయంతో బద్దలుకొట్టింది
?మానసిక వైకల్యం ఉన్న ఓ బాలుడు ఏకధాటిగా 30 నిమిషాల 34 సెకన్ల పాటు నృత్యం చేసి అంతర్జాతీయ ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’ల్లో అరుదైన ఘనతను నమోదు చేసుకున్నాడు
?ఉదర భాగంలో కొవ్వును కరిగించడానికి నూతన చికిత్సా విధానం ‘కార్బాక్సీథెరపీ’
?ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సేవ సంస్థ జెన్‌పాక్ట్‌ ముందుకొచ్చింది
?స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఒవియైడోబీ ఇన్‌స్టిట్యూటో డె ఆస్ట్రోఫిసికా డె కనారియాస్‌ పరిశోధకులు అంతరిక్షంలోని రెండు కొత్త గ్రహ వ్యవస్థలను కనుగొన్నారు.
?డిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 జూన్‌ 9న ఉత్తర్వులు జారీ చేసింది
?బ్రిటన్‌లోని 33 మంది ప్రవాస భారతీయులకు మహారాణి ఎలిజబెత్‌-2 జన్మదిన పురస్కారాలు లభించాయి
?బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని 2018 జూన్‌ 9న లండన్‌లో నిర్వహించిన సైనిక కవాతులో భారత సంతతి సిక్కు సైనికుడు గురుదాస్‌ మన్‌చరణ్‌ప్రీత్‌ సింగ్‌ లాల్‌(23) తమదైన ప్రత్యేక తలపాగాను ధరించి పాల్గొన్నారు.

One thought to “Telugu Current Affairs One Liners 12 June 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.