Telugu Current Affairs One Liners 13 August 2018

Telugu Current Affairs One Liners 13 August 2018

Telugu Current Affairs One Liners 13 August 2018





?12 సం॥ల లోపు బాలికలపై అత్యాచారం చేసే వారికి మరణశిక్ష సహా ఇతర కఠిన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన క్రిమినల్‌ లా (సవరణ) చట్టం-2018కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు

?రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు కుమారుడు దివంగత శ్రీనివాస్‌ పేరిట ఏటా అందజేస్తున్న ‘ఉత్తమ నూతన దర్శక’ పురస్కారాన్ని 2017కు గాను కొంకొణసేన్‌ శర్మ అందుకున్నారు

?మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తాహిల్‌ రమణి 2018 ఆగస్టు 12న ప్రమాణ స్వీకారం చేశారు

?నోబెల్‌ బహుమతి గ్రహీత, భారత సంతతి రచయిత వీఎస్‌ నైపాల్‌(85) 2018 ఆగస్టు 11న లండన్‌లో మృతి చెందారు

?సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరుకునేందుకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 2018 ఆగస్టు 12న కేప్‌ కెనావెరాల్‌ వైమానిక కేంద్రం నుంచి ప్రయోగించింది

?దేశంలోని అన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుంచే యోగా కార్యక్రమాల పాఠాలు ప్రవేశపెట్టాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) నిర్ణయించింది

?తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టాప్సీ) ఉపాధ్యక్షుడిగా రమాకాంత్‌ ఇనానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

?‘నైతిక విలువలు..న్యాయానుసార ప్రపంచం’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో 2018 ఆగస్టు 11, 12 తేదీల్లో జాతీయ న్యాయ సదస్సు నిర్వహించారు.

Click Here For All Competitive exams books

Daily Current Affairs PDF