Telugu Current Affairs One Liners 13 July 2018
Telugu Current Affairs One Liners 13 July 2018
?కేంద్ర ప్రభుత్వ భవనాల్లో సివిల్ పనులు చేపట్టడంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు CPWD అవార్డులు దక్కాయి
?అరుణ గ్రహం(మార్స్-అంగారకుడు)పై కాలుమోపబోయే తొలి మహిళగా (ఈ గ్రహంపై మొదట అడుగుపెట్టే వారిలో ఒకరిగా) అమెరికాలోని లూసియానాకు చెందిన 17 ఏళ్ల అలెసా కార్సన్ రికార్డు సొంతం చేసుకోనుంది
?అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు
?రైల్వే స్టేషన్ల సుందరీకరణలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు 3వ స్థానం దక్కింది
?అమెరికాలో స్వయం కృషితో అత్యంత ధనవంతులుగా ఎదిగిన 60 మంది మహిళల 4వ వార్షిక జాబితాను ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథీలు చోటు దక్కించుకున్నారు
?ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మానవతావాది దాదా జె.పి.వాస్వానీ(99) 2018 జులై 12న పుణెలో మృతి చెందారు. కన్ను మూశారు
?దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్న కోటిమందికి పైగా మహిళలనుద్దేశించి ప్రధాని నరేంద్రమోడి 2018 జులై 12న నమో యాప్ ద్వారా మాట్లాడారు