Telugu Current Affairs One Liners 13 June 2018

177 total views, 1 views today

Telugu Current Affairs One Liners 13 June 2018

Telugu Current Affairs One Liners 13 June 2018




11వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను రాఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌) కైవసం చేసుకున్నాడు
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ ఛైర్మన్‌గా ఎస్‌.రమేష్‌ నియమితులయ్యారు
ప్రపంచవ్యాప్తంగా 2018 జూన్‌ 12న ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు
బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం 2018 జూన్‌ 12న బెంగళూరులో నిర్వహించారు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండు అవార్డులు అందుకున్నాడు
అణు నిరాయుధీకరణపై అమెరికా, ఉత్తర కొరియా దౌత్యం విజయవంతమైంది.2018 జూన్‌ 12న సింగపూర్‌లోని కెపెల్లా హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు సమావేశమయ్యారు
మధుమేహ వ్యాదిగ్రస్తుల కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హైదరాబాద్‌(ఐఐపీహెచ్‌) టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబరు 1800 121 2096ను ఆరంభించింది
దేశంలో రైల్వే ప్రయాణికుల కోసం కొత్తగా రెండు మొబైల్‌ యాప్‌లు రైల్‌ మదద్‌, మెనూను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెన్నైలో విడుదల చేశారు
ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ (ఐఈఎస్‌) ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ నాయకత్వ పురస్కారానికి సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ను ఎంపిక చేసింది
గ్రామాలు, పట్టణాల్లో రహదారులు, కల్వర్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల్లో 50 సెంట్లను కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్‌లకే అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది
ఉత్తమ పనితీరును కనబర్చిన పలు స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను అందించింది
బంగ్లాదేశ్‌ రచయిత, పబ్లిషర్‌ షాజహాన్‌ బచ్చూను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు
ఆంధ్రప్రదేశ్‌ పే రివిజన్‌ కమిషన్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ మిశ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

One thought to “Telugu Current Affairs One Liners 13 June 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.