Telugu Current Affairs One Liners 13 May 2018

135 total views, 1 views today

Telugu Current Affairs One Liners 13 May 2018

Telugu Current Affairs One Liners 13 May 2018





> అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ శక్తిమంతమైన ఫాల్కన్‌-9 రాకెట్‌ను 2018 మే 12న విజయవంతంగా ప్రయోగించింది.
> అత్యాధునిక 3డీ ముద్రిత సాంకేతికతతో రూపొందించిన అవయవంతో, తుంటి జాయింట్‌ మార్పిడి శస్త్రచికిత్సను డిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు
> మలేషియాలో జరిగిన మెలాక ఐటీఎఫ్‌ గ్రేడ్‌-4 అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విజేతగా తెలంగాణ టెన్నిస్‌ క్రీడాకారిణి అమినేని శివాని నిలిచింది
> లండన్‌ మహానగరం చారిత్రక అంశాల్లో బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా చోటు లభించనుంది. వందేళ్ల కింద ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన అంబేడ్కర్‌ అక్కడి కింగ్‌హెన్రీ రోడ్‌లోని ప్క్రెంరోజ్‌ హిల్‌, నంబర్‌ 10 ఇంట్లో నివసించారు
> జంతువులు మేతనే కాకుండా స్మృతులను కూడా నెమరువేసుకుంటాయని ఇండియానా విశ్వవిద్యార్థులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది
> పాకిస్థాన్‌ హాకీ దిగ్గజం మన్సూర్‌ అహ్మద్‌ 2018 మే 12న మృతి చెందాడు. 49 ఏళ్ల అహ్మద్‌ దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.
> అంగారకుడి వాతావరణంలో తొలిసారిగా ఒక చిన్న హెలికాప్టర్‌ను గగనవిహారం చేయించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది
> అమెరికాలో ఉద్యోగ అనుమతులు పొందిన హెచ్‌-4 వీసాదారుల్లో 93% మంది భారతీయులే ఉన్నారు. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఓ స్వతంత్ర కమిటీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
> ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)పై విజయం తర్వాత ఇరాక్‌లో 2018 మే 12న తొలిసారిగా పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి
> ప్రపంచవ్యాప్తంగా 2018 మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. న్యూడిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 35 మందికి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అవార్డులు ప్రదానం చేశారు.
> రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష విభాగం ఏటా నవంబరులో నిర్వహించే జాతీయ ప్రతిభా స్కాలర్‌షిప్‌ను కేంద్రం రెట్టింపు చేసింది. గతంలో రూ.6 వేలు ఉండగా దీన్ని రూ.12 వేలకు పెంపు చేసింది.
> విజయవాడలో రూ.80 కోట్లతో 1.20 ఎకరాల్లో నిర్మించబోయే హజ్‌హౌస్‌ పనులకు సీఎం చంద్రబాబునాయుడు 2018 మే 12న శంకుస్థాపన చేశారు
> యాసంగి వరి ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రైతులు కొత్త రికార్డు సృష్టించారు. గత ఐదేళ్ల యాసంగి సీజన్‌లో అత్యధికంగా ఈసారి అరకోటి టన్నులకు పైగా వరి ధాన్యం, వాటినుంచి 33.41 లక్షల టన్నుల బియ్యం దిగుబడి వచ్చినట్లు అర్థ, గణాంకశాఖ విడుదల చేసిన 3వ ముందస్తు దిగుబడుల అంచనా నివేదికలో ప్రకటించింది

?Read Detailed Articles Here 

One thought to “Telugu Current Affairs One Liners 13 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.