Telugu Current Affairs One Liners 14 June 2018

Telugu Current Affairs One Liners 14 June 2018

Telugu Current Affairs One Liners 14 June 2018




?10వ గ్లోబల్‌ అలయన్స్‌ టు ఎలిమినేట్‌ లింఫాటిక్‌ ఫైలేరియాసిస్‌ సదస్సును 2018 జూన్‌ 13న న్యూడిల్లీలో నిర్వహించారు
?2018 ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌ టెక్నాలజి అంతర్జాతీయ సదస్సును 2018 జూన్‌ 17న నేపాల్‌లోని ఖాట్మండ్‌లో నిర్వహించనున్నారు
?చౌకధర దుకాణాలను చంద్రన్న గ్రామీణ మాల్స్‌గా మార్చేందుకు సరకు సరఫరా సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం చేసిన నియమ నిబంధనలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించింది
?పేదరికం నుంచి బయటపడేందుకు గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్లే రాష్ట్ర మహిళలకు సంపూర్ణ భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
?స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ ప్రాజెక్టు ఫేజ్‌-3లో భాగంగా కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ 10 ప్రదేశాలను ఎంపిక చేసి ప్రకటించింది
?రిజర్వేషన్‌ అవసరం లేని టికెట్ల జారీ కోసం రైల్వేశాఖ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ని ‘UTS on Mobile’ అందుబాటులోకి తెచ్చింది
?మధ్యప్రదేశ్‌ గో సంరక్షణ మండలి అధ్యక్షుడిగా ఉన్న స్వామి అఖిలేశ్వరానందకు కేబినెట్‌ మంత్రి హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది
?ఫోన్‌ నంబర్ల సెర్చ్‌ ఇంజిన్‌ ట్రూ కాలర్‌, చెల్లింపు విభాగంలోకి (పేమెంట్స్‌ స్పేస్‌) అడుగుపెట్టేందుకు వీలుగా ‘చిల్లర్‌’ పేమెంట్స్‌ యాప్‌ను కొనుగోలు చేసింది
?ప్రముఖ భారత సామాజిక సేవకుడు, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘నిక్కీ ఏసియా ప్రైజ్‌’ను 2018 జూన్‌ 13న టోక్యోలో ప్రదానం చేశారు
?కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ ప్రాజెక్టు ఫేజ్‌-3లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి క్షేత్రంకు చోటు దక్కింది
?తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ఫౌండేషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ ప్రసాద్‌ నల్లూరి ఎన్నికయ్యారు