Telugu Current Affairs One Liners 14 May 2018

Telugu Current Affairs One Liners 14 May 2018

Telugu Current Affairs One Liners 14 May 2018

> భారత్‌లో జన్మించిన హిందూజా సోదరులు బ్రిటన్‌లో అత్యంత కుబేరులుగా 2017లో తొలిస్థానం దక్కించుకోగా 2018లో మాత్రం 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు
> భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌ జర్మనీలోని హనోవర్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచాడు
> తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధి నకిరేకల్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల్లో స్వచ్ఛత కోసం జరిగిన ప్రయోగాత్మక ‘ఉద్దీపన’ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తరించనుంది. దీనిని అన్ని రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది.
> ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ ఆనందరాం సతీమణి విమల రాసిన ‘మంగళాపురం కథలు’ పుస్తకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ 2018 మే 13న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
> అసెంట్‌ నివేదికలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు 47వ స్థానం
> ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మరో 200 టోకు వ్యవసాయ మార్కెట్లను ‘ఈ-నాం’ పరిధిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది
> వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007కి కీలక సవరణలు చేసింది.
> దక్షిణాసియా దేశాల్లోని ప్రజలు 2017 మే నుంచి 2018 ఏప్రిల్‌ మధ్య 97 సార్లు ఇంటర్నెట్‌ సేవలకు దూరమైతే వాటిలో 82 సందర్భాలు భారత్‌లోనే చోటు చేసుకున్నాయి. దేశంలోనే మొదటిసారిగా సీబీఎస్‌ఈ ఆరుగురు విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది. వీరంతా మన దేశం తరఫున విదేశాల్లో వివిధ క్రీడావిభాగాల్లో పాల్గొన్నారు.
> తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజేఏసీ) నూతన ఛైర్మన్‌గా కె.రఘు, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పురుషోత్తం ఎన్నికయ్యారు
> ఆరు దశాబ్దాలుగా రక్తదానం చేస్తూ లక్షలాది మంది పాలిట ప్రాణదాతగా నిలిచిన ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ హారిసన్‌ 2018 మే 11న vభారతీయ > అణు పరీక్షలకు స్వస్తి పలుకుతూ ఉత్తర కొరియా ‘పుంగ్యే-రి’ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేయనుంది
> భారత సైన్యం ‘ఎయిర్‌ క్యావరీ’ పేరుతో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. శత్రు దేశపు భూతల దళాలను గుర్తించి, నాశనం చేయడానికి వియత్నాం యుద్ధంలో అమెరికా ఈ తరహా ఎత్తుగడను ప్రయోగించింది

?Read Detailed Articles Here 

One thought to “Telugu Current Affairs One Liners 14 May 2018”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.