Telugu Current Affairs One Liners 15 June 2018

Telugu Current Affairs One Liners 15 June 2018

Telugu Current Affairs One Liners 15 June 2018

?అమెరికాలోని షికాగోలో 2018 సెప్టెంబర్‌ 7 నుంచి మూడ్రోజుల పాటు ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ సదస్సును నిర్వహించనున్నారు
?2019లో జరిగే 106వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు జలంధర్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) ఆతిథ్యమివ్వనుంది
?నాస్తికుల కంటే ఆస్తికులు సగటున నాలుగేళ్లు ఎక్కువగా జీవిస్తున్నారని అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది
?భారత్‌లో జరిగే ప్రవాస భారతీయుల (ఎన్నారై) వివాహాలను వారం రోజుల్లోగానే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది
?ఈ-పీడీఎస్‌ విధానం ఫలవంతం చేసినందుకుగాను తెలంగాణ పౌరసరఫరాల శాఖకు జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డు-2018 లభించింది
?భారత్‌కు చెందిన విశ్వనాథన్‌ ఆనంద్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్లో ఉమ్మడిగా 2వ స్థానంలో నిలిచాడు
?రాష్ట్రాలకు ‘ఉమ్మడి జల యాజమాన్య సూచీ (కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌`సీడబ్ల్యూఎంఐ)ల’ను కేటాయిస్తూ నీతి ఆయోగ్‌ రూపొందించిన నివేదికను కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ న్యూడిల్లీలో విడుదల చేశారు
?కలరా వ్యాప్తిని అరికట్టే సరికొత్త టీకాను అమెరికాలోని హోవార్డ్‌ హ్యూస్‌ వైద్యసంస్థ(హెచ్‌హెచ్‌ఎంఐ) శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు
?తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి సంస్థ 18 వేల ట్యాబ్‌లను అందజేయనుంది
?ప్రపంచవ్యాప్తంగా 2018 జూన్‌ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవం(వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డే) నిర్వహించారు
?టీమ్‌ ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో లంచ్‌ విరామం లోపే సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు
?భారత క్రికెట్‌ మహిళల జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానా ఇంగ్లాండ్‌లోని కియా సూపర్‌ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది
?21వ ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలు 2018 జూన్‌ 14న రష్యా రాజధాని మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ప్రారంభమయ్యాయి
?మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధినాయకుడు రాజ్‌ ఠాక్రే జన్మదినం సందర్భంగా ఆ పార్టీ ద్విచక్ర వాహనదారులకు పెట్రోలుపై రూ.4 నుంచి రూ.9 వరకు రాయితీ ఇచ్చారు.
?రూ.18,800 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకున్న భిలాయ్‌ ఉక్కు కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడి 2018 జూన్‌ 14న జాతికి అంకితం చేశారు
?వాహన రంగంలో అగ్రగామి సంస్థ అయిన అమెరికాలోని జనరల్‌ మోటార్స్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా ఇండియన్‌- అమెరికన్‌ దివ్యా సూర్యదేవర (39) నియమితులయ్యారు.
?అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ సేవల కంపెనీ యాక్సెంచర్‌ తమ సెక్యూరిటీ విభాగానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన సైబర్‌ భద్రత నిపుణుడు అనూప్‌ ఘోశ్‌ను నియమించింది